ఇండస్ట్రీలో ఎవరు ఉండాలనేది డిసైడ్ చేసేది వాళ్లే.. బాలీవుడ్ తీరుపై వర్మ ట్వీట్ల సునామీ
సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్‌లోని బంధుప్రీతి, ఫేవరిటిజం, గ్రూపులు, గ్యాంగుల, మాఫియా లాంటి విషయాలపై భారీగా చర్చకు తెర లేసింది. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని జోహర్, ఖాన్, కపూర్ల ఫ్యామిలీలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ కరణ్ జోహర్, ఆలియాభట్‌ను టార్గెట్ చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. వరుస ట్వీట్లతో ఆయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ సరికొత్త చర్చకు దారి తీశారు. వర్మ తన ట్వీట్లలో...
Recommended Video

బచ్చన్, జోహర్స్ అవుట్ సైడర్సే
ఇప్పుడు ఇన్‌సైడర్స్ అనుకొనే అమితాబ్ బచ్చన్, కరణ్ జోహర్ లాంటి వాళ్లంతా ఒకప్పుడు ఇండస్ట్రీకి అవుట్‌సైడర్స్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇన్‌సైడర్ అనే కారణంతో లక్షలాది మంది వారి సినిమాలు చూశారంటే సరికాదు. ఫిల్మ్ ఇండస్ట్రీని శాసించే పెద్ద ఫ్యామిలీలకు అవుట్ సైడర్స్ తీసిన సినిమాల కంటే ఎక్కువగా ఫెయిల్యూర్ ఎదురయ్యాయి అని వర్మ మరో ట్వీట్‌లో స్పందించారు.

సుశాంత్ కూడా తన కొడుకును పెట్టి..
మరో 12 లేదా 15 ఏళ్లు బాలీవుడ్‌లో సుశాంత్ ఉండగలిగితే.. ఆయన ఇన్‌సైడర్ అయ్యేవాడేమో. ఆ తర్వాత తన వారసుడిని పెట్టి సినిమాను తీస్తే ఇలా ప్రశ్నలు వచ్చేవో రావో తెలియదు. అప్పుడు కరణ్ జోహర్ మాదిరిగా సుశాంత్‌ను కూడా టార్గెట్ చేసి ఉండేవారేమో అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎవరు ఎవరితో పనిచేయాలనేది
ఇండస్ట్రీ నుంచి సుశాంత్‌ను బయటకు పంపించాలని ఎంత మంది ప్రయత్నించారనే లెక్క కాదు. అదే సమయంలో సుశాంత్‌తో వర్క్ చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఎవరు ఎవరితో పనిచేయాలి? ఎవరు చేయకూడదని వారి వారి ఇష్టాలను బట్టి నిర్ణయాలు జరుగుతాయి అని రాంగోపాల్ వర్మ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

సుశాంత్ స్టార్ అయ్యారు.. అలాంటి అవకాశం లభించని వారెందరో
బాలీవుడ్‌లో చోటు దొరికి స్టార్ స్టేటస్ పొందడం, ఉన్నతశిఖారాలకు చేరుకోవడమనేది చాలా కష్టమైన పని. కనీసం సుశాంత్ బాలీవుడ్ లాంటి చంద్రుడిని తాకాడు. మరికొందరు కనీసం ఏ ఒక్క అవకాశం లభించక భూమిపైనే ఉన్నారు. అలాంటి వారు ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తూ వారికి వారు ఆత్మహత్యలు చేసుకోవాలా? అంటూ వర్మ ఓ ప్రశ్నను వదిలారు.

సుశాంత్ మరణానికి ముందు
సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్‌లో బంధుప్రీతి అది.. ఇదీ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో గొడవ చేసే వారు సుశాంత్ సింగ్ మరణానికి 48 గంటల ముందు ఆయనకు అవకాశాలు రావడం లేదని, ఆయనను తొక్కేస్తున్నారనే విషయాన్ని సోషల్ మీడియాలో ఎందుకు ప్రస్తావించలేదు. సుశాంత్ సూసైడ్ తర్వాత కరణ్ జోహర్‌ను టార్గెట్ చేయడం సహజమా? అంటూ వర్మ వరుస ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు..
బాలీవుడ్‌లో అవుట్ సైడర్, ఇన్‌సైడర్ రెండు విషయాల మీద భారీగా చర్చ జరుగుతున్నది. ఆడియెన్స్ ప్రభావితం చేసే శక్తి సినిమా ఫ్యామిలీలకు లేదు. ఆడియెన్స్ కారణంగానే కరణ్ జోహర్ ప్రముఖుడిగా మారారు కానీ తనంతటా తానుగా ఇండస్ట్రీలో పెద్ద మనిషి కాలేదు. ఇన్‌సైడర్, అవుట్ సైడర్ల భవిష్యత్‌ను తేల్చేది ప్రేక్షకులు మాత్రమే అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











