తేజస్వి స్టేట్మెంట్ అలా.... వర్మ ఇలా అంటున్నారేంటి?

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ ఈ వార్తలను ఖండించారు. 'మంచు విష్ణుతో చేస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ '12' అనే టైటిల్ ఎలా ప్రచారంలోకి వచ్చిందో అర్థం కావడంలేదు' అని తెలిపారు. తేజస్వి ఈ టైటిల్ విషయం బయట పెట్టిందని తెలుపగా.....'మేము మాట్లాడుకుంటుంటే ఆమె విని ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఏ టైటిల్ ఖరారు కాలేదు' అని వర్మ తెలిపారు.
కాగా...వర్మ దర్శకత్వంలో తేజస్వి ప్రధాన పాత్రలో నటించిన 'ఐస్ క్రీమ్' చిత్రం ఈరోజు విడుదైలైంది. తేజస్వి-నవదీప్ జంటగా నటించారు. 'ఐస్ క్రీమ్' చిత్రంలో తేజస్వి ఓ సన్నివేశంలో ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా నటించింది. నగ్న సన్నివేశాన్ని చిత్రీకరించేటపుడు డైరెక్టర్, కెమెరామెన్ సహా యూనిట్ సభ్యులు ఎవరూ షూటింగ్ స్పాట్‌లో లేరు.
అయితే 'ఐస్ క్రీమ్' సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదని తెలుస్తోంది. ఈచిత్రానికి రివ్యూలు కూడా నెగెటివ్‌గానే వస్తున్నాయి. రెండు రోజులు గడిస్తేగానీ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం పెర్ఫార్మెన్స్ ఏవిధంగా ఉంటుందనే విషయం చెప్పలేం.


Click it and Unblock the Notifications











