సెక్స్ తిరగేస్తే...రామ్ గోపాల్ వర్మ నుండి శృంగార చిత్రం!
హైదరాబాద్: 'ఐస్ క్రీమ్' చిత్రం ఇల థియేటర్లలోకి వచ్చిందో లేదో......అప్పుడే తన తర్వాతి సినిమా ప్రకటించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నెక్ట్స్ హిందీ చిత్రం చేయబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ సినిమా పేరు 'XES'. ఈచిత్రానికి సంబంధించిన పోస్టర్ కూడా వర్మ తన ట్విట్టర్లో ట్వీట్ చేసారు.
ఇప్పటి వరకు అన్ని రకాల సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ......శృంగార చిత్రం మాత్రం తెరకెక్కించలేదు. 'XES' చిత్రం ద్వారా తన కెరీర్లో ఉన్న ఆ వెలితిని పూడ్చ బోతున్నారు వర్మ. కెరీర్లో తొలిసారి సెక్స్ ప్రధానమైన సినిమా చేస్తుండటంపై రామ్ గోపాల్ వర్మ ఎగ్జైట్మెంటుతో ఉన్నారు.

'కెరీర్ మొదటలు పెట్టిన తర్వాత అన్ని రకాల సినిమాలు తీసాను. శివ (స్టూడెంట్ పాలిటిక్స్), రంగీలా (లవ్ స్టోరీ), భూత్ (హారర్), సత్య (గ్యాంగ్ స్టర్), దౌడ్ (కాపర్), సర్కార్ (డ్రామా), కౌన్ (సైకలాజికల్ థ్రిల్లర్), అటాక్స్ ఆఫ్ 26/11 (టెర్రరిజం) ఇలా చాలా రకాలు చేసాను. కానీ ఇప్పటి వరకు శృంగార ప్రధానమైన సినిమా మాత్రం చేయలేదు. ఇపుడు చేయాలనుకుంటున్నాను. 'XES' టైటిల్‌తో ఈ సినిమా ఉంటుందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
సాధారణ సెక్స్ చిత్రాల్లా కాకుండా ఈచిత్రాన్ని డిఫరెంటుగా, తనదైన శైలిలో తెరకెక్కించేందుకు రామ్ గోపాల్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. సెక్స్ గురించి మనిషి ఆలోచనల్లోని ఆరు డిఫరెంటు సిచ్యువేషన్స్ ....ఒకే స్టోరీలో చూపించబోతున్నారు. సెక్స్‌కు సంబంధమైన అంశాల్లో..... నేరము, ద్రోహం, హెల్ప్‌లెస్‌నెస్, ఎంబరాస్మెంట్, హర్ట్, ఇవన్నీ కలిపి ఒక యాంగిల్ చూపించబోతున్నామని వర్మ చెప్పుకొచచ్చారు. మరి వర్మ శృంగార ప్రియులను ఏమేరకు మెుప్పిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











