రాణా, లక్ష్మీ ప్రసన్న ముంబైలోనే
దగ్గుపాటి రాణా, మంచు లక్ష్మీ ప్రసన్న దాదాపు నెల రోజులు పాటు ముంబైలోనే ఉండనున్నారు. రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న డిపార్టమెంట్ చిత్రం షూటింగ్ నిమిత్తం వారు ముంబైలో మకాం వేస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ తాజాగా డిపార్టమెంట్ గురించి బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ... డిపార్టమెంట్ చిత్రంలో అమితాబ్ బచ్చన్.. పొలిటీషయన్ గా మారిన గ్యాంగస్టర్ పాత్రను పోషిస్తున్నారు. అలాగే నా కెరీర్ లో ఈ చిత్రం బాగా ఎక్కవ బడ్టెట్ అవుతోంది. స్క్రిప్టు కూడా చాలా ప్రెష్ గా ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు గురించి బయట రకరకాల రూమర్స్ వినపడుతున్నాయి.
అమితాబ్.. పోలీస్ ఆఫీసర్ గా నటించటం లేదు. అలాగే ఈ చిత్రం కంపెనీ కి సీక్వెల్ కాదు.. అలాగే అబతక్ చప్పన్ కి ప్రీక్వెల్ కూడా కాదు. ఇక నాకు ఎప్పుడూ అమితాబ్ ని మాస్ హీరోగానే చూస్తాను. ఆయన్ని లార్జర్ దేన్ లైఫ్ హీరోగా డిపార్టమెంట్ లో చూపదలుచుకున్నాను. రాణా ఈ చిత్రంలో చేస్తున్నాడు. రాణా, సంజయ్ దత్ ఇద్దరూ పోలీస్ లు కనిపిస్తారు. రాణాకు మెంటర్ గా సంజయ్ దత్ కనిపిస్తారు అన్నారు. ఇక కంగనా రౌనత్ ని అనుకున్న పాత్రకు లక్ష్మీ ప్రసన్నని తీసుకున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ ప్రసన్న కూడా ఈ బాలీవుడ్ ప్రాజెక్టుకు చాలా ఉషారుగా ఉంది.


Click it and Unblock the Notifications











