twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శత్రువులు, నమ్మక ద్రోహులెవరో? చూపిస్తా.... ఎన్టీఆర్ బయోపిక్‌పై ఆర్జీవీ

    సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లు వర్మ ప్రకటించారు. ఈ సినిమాలో పలు వివాదాస్పద అంశాలు, వ్యక్తులు ఉంటారని తెలిపారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు సీనియర్ ఎన్టీఆర్. తెలుగు సినిమా రంగంలో ఆయన సాధించినంత కీర్తి బహుషా ఎవరూ సాధించలేదేమో. ఎంతో మంది అభిమానుల మదిలో దేవుడిగా తన స్థానం పదిలం చేసుకున్న ఎన్టీఆర్.... ఆ తర్వాత రాజకీయ పార్టీ స్థాపించి, ముఖ్యమంత్రిగా అధికారం చేజిక్కించుకుని సంచలనం సృష్టించారు.

    ఎన్టీఆర్ సినీ జీవితం, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం ఎంతో ఆసక్తికరం. అనేక వివాదాలు, వివాదాస్పద వ్యక్తులు ఆయన జీవితంలో ఉన్నారు. బయటి ప్రపంచానికి ఆయన గురించి తెలియని విషయాలెన్నో. ఇవన్నీ సినిమా రూపంలో తెరపై ఆవిష్కరిస్తే ఊహించని స్పందన వస్తుంది. ఇపుడు ఇదే ఆలోచన వర్మకు వచ్చింది. సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. ఎన్టీఆర్ మీద ఓ పాట కూడా విడుదల చేశారు.

    తలెత్తుకునేలా చేసిన మూడు అక్షరాలు

    తలెత్తుకునేలా చేసిన మూడు అక్షరాలు

    తెలుగువాడిని మొట్ట మొదటి సారిగా తలెత్తుకునేలా చేసింది ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు. ఆ పేరు వింటే చాలు ప్రతి తెలుగు వాడి చాతి గర్వంతో పొంగిపోతుంది, స్వాభిమానం తన్నుకొస్తుంది. ఆయన ఒక మహా నటుడే కాదు... మొత్తం తెలుగునేల ఆయనకు ముందు, ఆయన తర్వాత కూడా చూడని అత్యధిక ప్రజాదరణ కలిగిన మహా రాజకీయ నాయకుడు అని వర్మ అన్నారు.

    గర్వంగా ఫీలవుతున్నాను

    గర్వంగా ఫీలవుతున్నాను

    నాకు ఆయనతో పర్సనల్‌గా ఉన్న అనుబంధం ఏమిటంటే ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అడవిరాముడు' చూడటానికి 23 సార్లు బస్సు టికెట్‌కి డబ్బులు లేక 10 కిలోమీటర్ల దూరం కాలినడకన నడిచి వెళ్లే వాడిని. అంతే కాకుండా ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగులో నేలఈనినట్లు వచ్చిన లక్షలాది మందిలో నేనూ ఉన్నాను. అలాంటి అతి మామూలు నేను ఇపుడు ఎన్టీఆర్ జీవితాన్నే ఒక బయోపిక్ గా తెరకెక్కించడం చాలా చాలా గర్వంగా ఫీలవుతున్నాను... అని వర్మ తెలిపారు.

    శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో? చూపిస్తా

    శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో? చూపిస్తా

    అత్యంత నిజమైన మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో? ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అన్నీ అశేషతెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్టీఆర్ చిత్రంలో చూపిస్తాను అని వర్మ ప్రకటించారు.

    పొగడరా నీతల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్ ను

    పొగడరా నీతల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్ ను

    ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు గారంటే నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ కెపాసిటీలో కాకుండా 8 కోట్ల తెలుగు వాళ్లలో కేవలం ఒకడిగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడికి తెలియజెప్పేది.... ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్‌ను అంటూ వర్మ పేర్కొన్నారు.

    ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన

    ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన

    తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లు ఇప్పటికే ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఆ పాత్రలో తానే చేస్తానని తెలిపిన ఆయన దర్శకుడు ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు. అయితే ఇంతలోనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుండి ఒక ప్రకటన రావడం నందమూరి అభిమానులను ఆందోళనలో పడేసింది.

    అత్యంత వివాదాస్పద వ్యక్తులు ఇద్దరు

    ఎన్టీఆర్ జీవితంలో అత్యంత వివాదాస్పద వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఆయన రెండో భార్య లక్ష్మి పార్వతి. మరొకరు అల్లుడు నారా చంద్రబాబు నాయుడు. ఈ ఇద్దరి ప్రస్తావన, చివరి రోజుల్లో వీరి మూలంగా ఆయన ఎదుర్కొన్న పరిణామాలు లేకుంటే..... ఎన్టీఆర్ బయోపిక్‌కు పూర్తి సార్దకత చేకూరదు అనేవారూ ఉన్నారు. మరి వర్మ ఈ విషయాలను ఏ మేరకు ఫోకస్ చేస్తారో చూడాలి.

    English summary
    Ram Gopal Varma to Direct Balakrishna NTR BIopic. News about RGV directing the biopic on legendary actor NTR comes in as both surprising and exciting piece of news since it involves the controversial filmmaker.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X