twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ స్వార్థానికి మంచు విష్ణు బలికాబోతున్నాడా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మంచు విష్ణు కెరీర్ ఇక ముగిసినట్లే అని అంతా అనుకుంటున్న తరుణంలో 'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా' లాంటి చిత్రాలతో గట్టకెక్కిన సంగతి తెలిసిందే. 'ఢీ' సినిమా తర్వాత వరుస ప్లాపులు ఎదుర్కొన్న విష్ణు చాలా ఆలస్యంగా ప్రేక్షకులు కోరుకునే ట్రాక్‌లోకి వచ్చాడు. సగటు ప్రేక్షకులు తన సినిమాల నుంచి ఏం కోరుకుంటున్నాడో ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటూ తనకు తగిన కథలను ఎంచుకుంటున్నాడు.

    తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం....మంచు విష్ణు త్వరలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. కామెడీ ఎంటర్టెనర్‌గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. గతంలో వర్మ దర్శకత్వంలో వచ్చిన 'అనగనగా ఒక రోజు' తరహలో సినిమా ఉంటుందని తెలుస్తోంది.

    అయితే ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డ విష్ణు....వర్మ దర్శకత్వంలో సినిమా ఒప్పుకోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వర్మ స్వార్థానికి విష్ణు బలి కాబోతున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వర్మ ఒకప్పుడు గొప్ప దర్శకుడే, ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమాలు తీసిన దర్శకుడే అయినప్పటికీ.....ఈ మధ్య ఆయన మైండ్ సెట్ పూర్తిగా మారిందని, ప్రేక్షకుల అభిరుచికి విలువ ఇవ్వకుండా తన స్వార్థానికి...ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను టార్చర్ పెడుతున్నాడని, అందుకు ఇటీవల వచ్చిన ఆయన సినిమాలే నిదర్శనమని అంటున్నారు.

    మరి అలాంటి దర్శకుడితో విష్ణు సినిమా చేసే ముందు కాస్త ఆలోచిస్తే బాగుంటుందని అంటున్నారు. కాగా...'దూసుకెళ్తా' విజయంతో మంచి జోష్ మీద ఉన్న విష్ణు ప్రస్తుతం తన తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్‌తో కలిసి 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో నటిస్తున్నాడు.

    English summary
    Ram Gopal Varma is set to direct Manchu Vishnu in his next film. Confirming the news, Manchu Vishnu says that he will be working with RGV once the multi-starrer he is currently doing with his father and brother is complete.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X