twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ సంచలన ప్రకటన.. సంజు బయోపిక్ మళ్ళీ తీస్తా.. అసలు నిజాలు బయటపెడతా!

    |

    Recommended Video

    Ram Gopal Varma Plans To Direct Sanju Again

    ఎక్కడ వివాదం అక్కడకు వర్మ వెతుక్కుంటూ వెళతాడు. ఆ విషయం మరో మారు రుజువైంది. రాంగోపాల్ వర్మ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ సంజు చిత్రం తనని తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపాడు. సంజయ్ దత్ బయోపిక్ ని వాస్తవాలతో మళ్ళీ తెరకెక్కిస్తానని ప్రకటన చేశాడు. వర్మ ప్రకటనతో బాలీవుడ్ లో దుమారం మొదలైంది. సంజు చిత్రంలో వాస్తవాలని పక్కన పెట్టి సంజయ్ దత్ ని మంచోడిగా చూపించే ప్రయత్నం చేశారనే ఆరోపణ ఉన్న సంగతి తెలిసిందే.

    300 కోట్లు దాటి

    300 కోట్లు దాటి

    రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన సంజు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళుతోంది. 300 కోట్లకు వసూళ్లుతో ప్రభంజనం సృష్టిస్తోంది. ఆడియన్స్ ఎమోషనల్ గా ఈ చిత్రంతో కనెక్ట్ అయ్యారు.

    వర్మ సంచలనం

    వర్మ సంచలనం

    యధార్థ గాధలని తెరకెక్కించాలనే ఆసక్తితో వర్మ ఉంటాడు. సంజు చిత్రం తాన్ని నిరాశ పరిచిందని, సంజయ్ దత్ బయోపిక్ ని వాస్తవాలతో మళ్ళీ తెరకెక్కిస్తానని వర్మ ప్రకటన చేసినట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.

    జీవితాన్ని కుదిపేసిన ఘటన

    జీవితాన్ని కుదిపేసిన ఘటన

    డ్రగ్స్ కేసు, ముంబై పేలుళ్లు ఇలా అనేక వివాదాలు సంజయ్ దత్ జీవితంలో చోటుచేసుకున్నాయి. ముంబై పేలుళ్ల ఘటన సంజయ్ దత్ జీవితంపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ ఘటనని సంజు చిత్రంలో సరైన విధంగా చూపించలేదని వర్మ అంటున్నాడు.

     ఆ అంశం పైనే

    ఆ అంశం పైనే

    వర్మ తెరకెక్కించబోయే సంజయ్ దత్ బయోపిక్ టైటిల్ సంజు ది రియల్ స్టోరీ అనే ప్రచారం జరుగుతోంది. వర్మ కేవలం 1993 ముంబై పేలుళ్లు, సంజయ్ దత్ నుంచి ఏకే 47 స్వాధీనం అంశాలపైనే చిత్రాన్ని తెరకెక్కిస్తానని వర్మ చూపినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    రీసెర్చ్

    రీసెర్చ్

    రాంగోపాల్ వర్మ ఇప్పటికే ఈ అంశాలపై రీసెర్చ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ సన్నిహితులని, అప్పటి పోలీసులని కలసి వివరాలు సేకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వర్మ దర్శకత్వంలో సంజయ్ దత్ రెండు చిత్రాల్లో నటించారు.

    English summary
    Ram Gopal Varma disappointed by Sanju. Plans to make 'real' Sanjay Dutt biopic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X