ఆ ఘటనను కళ్లకు కట్టినట్టు చూపించబోతోన్నాడు.. ‘దిశ ఎన్‌కౌంటర్’ ఫస్ట్ లుక్‌తో వర్మ సెన్సేషన్
రామ్ గోపాల్ వర్మ అంటే మామూలు విషయం కాదు. వేటినైనా సరే తనకు అనుకూలంగా మార్చేసుకుంటాడు. తనను తిట్టినా సరే అది కూడా పాజిటివ్‌గా తీసుకుంటాడు. వాటిని కూడా ప్రమోషన్స్‌లో వాడుకుంటాడు. వివాదాలు రేపి సినిమాలను ప్రమోట్ చేసుకోవడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. అసలే ఇప్పుడు ప్రణయ్ హత్య కేసుపై మర్డర్ అనే సినిమా తీస్తోన్న వర్మ.. దిశ హత్యకేసుకు సంబంధించి మూవీ అప్డేట్‌ను ప్రకటించాడు.

సంచలనం సృష్టించిన దిశ..
దిశ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో దిశపై అత్యాచారం చేసి, దారుణంగా తగులబెట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈకేసులోని నలుగురు దోషులను ఎన్ కౌంటర్ చేసే వరకు ఆగ్రహ జ్వాలలు తగ్గలేదు. అలాంటి సెన్సేషనల్ ఇష్యూపై వర్మ సినిమా తీశాడు.

ఫస్ట్ లుక్‌తో రచ్చ..
దిశ ఘటనకు కారణమైన టోల్ గేట్, స్కూటీ, లారీ వంటివాటిని ఫస్ట్ లుక్‌లో చూపెట్టి సినిమా ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశాడు. జరిగిన ఘటనను క్లియర్ కట్‌గా చూపించేందుకు వర్మ సిద్దమయ్యాడు. ఈ మేరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది.

వరుసగా పోస్టర్లు..
అంత ఘోరంగా ఓ అమ్మాయిని హత్య చేసి చంపినా కూడా చట్టాలు మారలేదు. కానీ ప్రపంచంలోనే మొదటి సారిగా ఓ పోలీస్ స్టేషన్‌కు దిశ అని నామకరణం చేశారు అంటూ వర్మ తన సినిమా ప్రమోషన్స్ పెంచుకుంటున్నాడు. ఈ మేరకు వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు.
Recommended Video

టీజర్ అప్పుడే..
ఎక్కడైతే దిశను కాలబెట్టారో.. ఆ అండర్ బ్రిడ్జ్ ఆ రేపిస్ట్‌లా భయంకరంగా కనిపిస్తోంది అంటూ సినిమాలోని కొన్ని షాట్స్‌ను వర్మ షేర్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 26న, సినిమా నవంబర్ 26న రిలీజ్ కాబోతోందని వర్మ ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











