రాంగోపాల్ వర్మనే.. వాడుకుంటున్న ముదుర్లు
టాలీవుడ్ లో దర్శకులు రోజు రోజుకు ముదిరి పోతున్నారు. రాంగోపాల్ వర్మలాంటి దర్శకులను సైతం తమ సినిమాల్లో బఫూన్లను చేసి వాడుకుంటున్నారు. ఆ మధ్య వచ్చిన అప్పల్రాజు సినిమాలో వర్మ దర్శకులందరినీ...టార్గెట్ చేసి వాడుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పడు ఆ దర్శకులు రాంగోపాల్ వర్మను వాడేసుకుంటున్నారు.
మహేష్‌బాబు నటించిన 'దూకుడు'లో విలన్ తమ్ముడ్ని చంపిన వ్యక్తి ఫొటోను ధర్మవరపు చేత ఫ్యాక్స్ చేయించమని చెబితే.. దర్మవరపు మాత్రం రామ్‌గోపాల్‌వర్మ ఫొటో పంపించి ప్రేక్షకులచేత నవ్వులు తెప్పిస్తాడు. ఎన్.టి.ఆర్. 'ఊసరవెల్లి'లో జయప్రకాష్‌రెడ్డి బ్యాచ్ వర్మ తీసిన సినిమా శివ పేరును వాడుకుంది. ఆ గ్యాంగ్‌లో ఒకడి పేరు శివ.. శివలోని ఫార్మెట్‌లో చైన్లతో దందాలు చేసే రౌడీలన్నమాట. ఈ రెండు చిత్రాల దర్శకులు వర్మకు బాగా కావాల్సినవారే.
మరి పరిశ్రమలో ఈ మాత్రం కోఆపరేషన్ లేకుంటే నెగ్గుకు రావడం కష్టం. అందుకే వాళ్లను వీళ్లు, వీళ్లను వాళ్లు వేడేసుకుంటూ ప్రేక్షకులను మాత్రం ఎంటర్ టైన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











