Just In
- 27 min ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 47 min ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
స్నేహితుడి తల్లిపై కన్ను.. కోరిక తీర్చమని వేధింపులు, తిరగబడటంతో దాడి
- Sports
India vs England: 'టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు.. ఆ మాటలు నిత్యం గుర్తుకొచ్చేవి'
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాంగోపాల్ వర్మ ఎఫెక్ట్: జీవిత రాజశేఖర్, హైకోర్టు జడ్జ్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మారుమ్రోగిపోతోంది. దీనికి కారణం ఆయన చేస్తున్న సినిమాలే. గతంలో తనకంటూ ప్రత్యేకమైన జోనర్‌ను ఎంచుకుని సినిమాలు తీసిన ఈయన.. ఇప్పుడు మాత్రం సున్నితమైన అంశాలనే తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ సినిమాలన్నీ వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల ఆయన తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'తో పాటు తాజాగా తెరకెక్కించిన సినిమా కూడా ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వర్మ తాజా చిత్రం ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య విడుదలకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో కేఏ పాల్ ఓ సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. అంతేకాదు, కొందరు ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక ఏం జరిగింది.?

అప్పుడు అవి.. ఇప్పుడు ఇవి
రాంగోపాల్ వర్మ మొదటి నుంచీ ఎవరూ టచ్ చేయని అంశాలను తీసుకుని సినిమాలు చేస్తూ ఉండేవాడు. అందుకే ఆయన దేశ వ్యాప్తంగా సుపరిచితుడు అయ్యారు. గతంలో క్రైమ్, థ్రిల్లర్, హర్రర్ జోనర్లలో సినిమాలు చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు మాత్రం రాజకీయాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఆయన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే సినిమా తెరకెక్కించారు.

మాటల వరకే చేతల్లో మాత్రం వేరు
వాస్తవానికి ఈ సినిమాను ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే టైటిల్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో వివాదాస్పదం కాకుండా సినిమా తీస్తానని ఆయన వెల్లడించాడు. కానీ, ఇందులోని పాటలు, టీజర్, ట్రైలర్ వదిలిన తర్వాత పెద్ద రచ్చే జరుగుతోంది. దీంతో ఈ సినిమా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కేఏ పాల్‌తో వార్.. కష్టాలు తప్పలేదు
ఈ సినిమాలో కేఏ పాల్ పాత్రను కూడా చూపించాడు వర్మ. అంతేకాదు, ఆయన పాత్రకు సంబంధించిన ఓ పాటను కూడా యూట్యూబ్‌లో విడుదల చేశాడు. దీంతో పాల్.. ఈ సినిమా ఆపేయాలని కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సినిమా నిలుపుదలతో పాటు సెన్సార్ బోర్డుకు కొన్ని సూచలు చేసింది. అయితే, ఈ సినిమా అడ్డంకులు తొలగిపోయాయి.

ఆయనే సర్టిఫికెట్ ఇస్తున్నట్లు చూపాడు
ఈ సినిమాకు సెన్సార్ అవడంతో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశాడు ఆర్జీవీ. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను తనదైన శైలితో ప్రమోట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే స్వయంగా కేఏ పాల్.. వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు ఎడిట్ చేసిన ఫొటోను ట్వీట్ చేశాడు. వాస్తవానికి వర్మ స్థానంలో ఉన్నది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.
స్పందించిన పాల్.. జడ్జ్‌పై ఆరోపణలు
ఇక, ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో కేఏ పాల్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ‘వర్మ లాయర్ నుంచి హైకోర్ట్ జడ్జ్ కమిట్‌మెంట్ తీసుకుని ఈ సినిమాకు పర్మీషన్ ఇచ్చారు. సెన్సార్ బోర్డుకు సూచనలు చేశారు. వారిపై ప్రధాన న్యాయమూర్తికి కంప్లైంట్ చేస్తాను' అని సంచలన ఆరోపణలు చేశారు.

జీవిత రాజశేఖర్‌కు పది లక్షలు ఇచ్చా
ఇదే వీడియోలో జీవితా రాజశేఖర్‌పైనా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘జీవిత రాజశేఖర్ వైసీపీ మెంబర్స్. వాళ్లు ఈ సినిమా పేరు మార్చి, ఓ రెండు సీన్లు కట్ చేసి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇదే జీవిత రాజశేఖర్‌కు అప్పుల వాళ్లు వచ్చి గోల చేస్తున్నారంటే 2012లో పది లక్షలు ఇచ్చాను. ఆ డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు' అని చెప్పుకొచ్చారు.