Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బ్యూటిఫుల్ హీరోయిన్‌తో చిందేస్తూ ఎంజాయ్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే వర్మ.. ఈ సారి హీరోయిన్‌తో కలిసి రెచ్చిపోయి డాన్సులేస్తూ వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఏ హీరోయిన్‌తో వర్మ అంతలా చిందులేశాడు? ఆ సందర్భం ఏంటి? వివరాల్లోకి పోతే..
రామ్ గోపాల్ వర్మ.. బ్యూటిఫుల్
రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా `బ్యూటిఫుల్`. ''ట్రిబ్యూట్ టు రంగీలా'' అనేది ట్యాగ్ లైన్. టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై అగస్త్య మంజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. చిత్రంలో సూరి హీరోగా నటించగా, నైనా గంగూలీ హీరోయిన్గా నటించింది. రవి శంకర్ సంగీతం అందించారు.
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.. వర్మ
ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా జనవరి 1వ తేదీన విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి A సర్టిఫికెట్ జారీ అయింది. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి అందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు వర్మ.
హీరోయిన్‌తో.. ఫుల్లుగా ఎంజాయ్
ఈ ఈవెంట్లో హీరోయిన్ నైనా గంగూలీతో కలిసి స్టేజిపై చిందులేశాడు రామ్ గోపాల్ వర్మ. రెచ్చిపోయి డాన్సులేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వర్మ స్టెప్పులపై కామెంట్లు చేస్తూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
అదొక్కటే కాదు.. ఇది కూడా
గతంలో కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోయిన్లతో కలిసి ఎంజాయ్ చేశాడు వర్మ. అప్పట్లో ఆ వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. సో రామ్ గోపాల్ వర్మ అంటే కుండబద్దలు కొట్టే మాటలే కాదు.. రెచ్చిపోయి యంగ్ హీరోయిన్లతో చిందులు కూడా ఉంటాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది జనాలకు.
|
రొమాంటిక్ ప్రేమ కథ.. ఎలాంటి లోకం చూపిస్తారో!
రొమాంటిక్ ప్రేమ కథగా వైవిధ్య భరితమైన సన్నివేశాలతో 'బ్యూటిఫుల్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త లోకం పరిచయం చేయనున్నాం అని అంటున్నారు యూనిట్ సభ్యులు. చూడాలి మరి వర్మ ఇక ఎలాంటి లోకం చూపిస్తారో!.