డర్టీ హీరోయిన్ పై కన్నేసిన రామ్ గోపాల్ వర్మ...!?
సినిమా దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేక స్థానం ఉంది. రియల్ కథలను తెరకెక్కించడంలోనూ, వివాదాలతో తన సినిమాలకు పబ్లిసిటీ చేయడం లోనూ వర్మ స్టైలే వేరు. ఏదైనా విషయం అనుకుంటే...ఎన్నివిమర్శలు వచ్చినా దాన్ని పూర్తి చేసే పట్టుదల గల మనిషి. ఎప్పుడూ దెయ్యాలు, రౌడీలు, గొడవలు, కత్తులు కటార్లు, అంటూ ఏదో ఒకరకంగా జనాల్ని బయపెట్టే వర్మ, రకరకాల వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఈ మధ్య లవ్, రొమాన్స్ అంటూ కొత్త కోణంలో వెళ్తున్నాడు. తన సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలకు తక్కువ శాతం ఉండేలా చూసుకునే వర్మ, ప్రస్తుతం రొమాంటిక్ సన్నివేశాలతోనే ఓ ప్రేమకథను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే..
అయితే ఇటీవలే 'డర్టీ పిక్చర్" సినిమాలో అందాల ప్రదర్శన అతిగా చేసిన హీరోయిన్ విద్యాబాలన్ పై వర్మ కన్ను పడింది. విద్యాబాలన్ తో ఓ సెక్సీ రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి విద్యాబాలన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 'డర్టీ పిక్ఛర్" పార్ట్ 2గా వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తాడనడంలో అతిశయోక్తి లేదు. మరి విద్యా ఏమంటుందో చూడాలి...
కాగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ నాగచైతన్య, అమలపాల్ జంటగా 'బెజవాడ" సినిమాను నిర్మిస్తున్నారు.షూటింగు హైదరాబాదు షెడ్యులు పూర్తయింది. ఫారిన్ షూటింగ్ కోసం చిత్రం యూనిట్ స్విట్జర్లాండ్ బయలుదేరి వెళ్లింది. గురువారం (సెప్టెంబర్ 15) నుంచి హీరో హీరోయిన్లపై పాట చిత్రీకరణ మొదలుపెడుతున్నారు. స్విట్జర్లాండ్ తో బాటు ఇటలీ, ఒమెన్ లలో పదిరోజుల పాటు జరిగే షూటింగులో రెండు పాటలను చిత్రీకరిస్తారు. దీంతో షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తవుతుంది. దీపావళికి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత కోనేరు కిరణ్ కుమార్ చెప్పారు.


Click it and Unblock the Notifications











