twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గాడిద’ అన్నాడు...వర్మపై కేసు నిలుస్తుందా? లేదా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్ ద్వారా తరచూ వ్యాఖ్యలు చేయడం అలవాటే. ఆయన ఆ మధ్య గుర్మిత్‌రామ్‌ రహీం సింగ్‌ అలియాసా డేరా బాబాను ‘గాడిద'గా అభివర్ణించిన సంఘటనపై కేసు నమోదైంది. క్లాస్ బ్రీడ్ అంటూ వివాదాస్పద పదజాలం వాడుతూ ట్వీట్ చేయడం డేరా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. గుర్మిత్‌రామ్‌ రహీం సింగ్‌ తెరకెక్కించిన ‘మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమా నేపథ్యంలో వర్మ ఈ వ్యాఖ్యలు చేసారు.

    RGV

    వర్మ వ్యాఖ్యలకు సంబంధించి లుధియానాలో కేసు నమోదు అయ్యింది. ఫిబ్రవరి 13న 'మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమాపై వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విమర్శలు చేసారు. వర్మ వివాదాస్పద ట్విట్లపై డేరా అనుచరుడు లుధియానా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

    డేరా అనుచరుల నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు బుధవారం వర్మపై సెక్షన్ 66A కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరు పోలీసులు... వర్మకు నోటీసులు అందించేందుకు ముంబయి చేరుకున్నారు. డేరా సచ్చా సౌద అధినేత గుర్మిత్‌రామ్‌ రహీం సింగ్‌ అలియాస్ డేరా బాబాను వర్మ 'గాడిద'గా అభివర్ణించడం హాట్ టాపిక్ అయింది.

    అంతటితో ఆగకుండా క్రాస్ బ్రీడ్ అంటూ వివాదాస్పద పదజాలం వాడటం డేరా అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. మరోవైపు సెక్షన్ 66Aను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మపై లుధియానా పోలీసులు పెట్టిన కేసు ఎంతవరకూ నిలుస్తుంది? అనేది చర్చనీయాంశం అయింది.

    English summary
    The Ludhiana police landed in a tricky and awkward situation on Wednesday after two of its personnel were rushed to Mumbai to serve a notice to filmmaker Ram Gopal Varma under Section 66A of IT Act which was struck down by Supreme Court of India on Tuesday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X