బూతు ఫొటోలు వైరల్, మార్ఫింగ్ బారీన పడ్డ రాంగోపాల్ వర్మ.. అతడిపై కేసు, అసలు విషయం ఇదే!

Recommended Video

Ram Gopal Varma Complaints To Police On Jaya Kumar

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు వివాదాలు కొత్త కాదు. అత్యంత పెద్ద చిక్కుల్లో చిక్కుకుని వర్మపై కేసులు నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా వర్మ దేనిని సీరియస్ గా భావించడు. తనదారి తనదే అన్నట్లుగా వ్యవహరిస్తాడు. కానీ తొలి సారి వర్మ ఓ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఏకంగా పోలీస్ కేసు కూడా నమోదు చేశాడు. వర్మని అంతలా వేధించిన ఆ సంఘటన ఏంటో వివరాల్లో తెలుసుకుందాం..

 25 ఏళ్ల తరువాత నాగ్‌తో

25 ఏళ్ల తరువాత నాగ్‌తో

రాంగోపాల్ వర్మ ప్రస్తుతం నాగార్జునతో ఆఫీసర్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూన్ 1 విడుదలకు సిద్ధం అవుతోంది. వర్మ సినిమా తీస్తున్నదంటే అది కచ్చితంగా వివాదంగా మారుతుంది. ఆఫీసర్ చిత్ర విషయంలో కూడా అదే జరిగింది.

విడుదల వాయిదా

విడుదల వాయిదా

ఈ చిత్రం మే 25 నే విడుదల కావలసి ఉంది. కానీ బాంబే కోర్టులో కేసు వలన ఈ చిత్రం జూన్ 1 కి వాయిదా పడింది. యువ రచయిత జయకుమార్ ఆఫీసర్ చిత్రం విషయంలో మరో వివాదం రేపాడు.

కథ నాదే

కథ నాదే

రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఆఫీసర్ చిత్ర కథ తనదే అని జయకుమార్ ఇటీవల ఆరోపించాడు. న్యాయం చేయాలంటూ ఇటీవల జయకుమార్ నాగార్జునకు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. వర్మ రూపొందించిన జీఎస్టీ ఐడియా కూడా తనదే అని జయకుమార్ అంటున్నాడు. సర్కార్ 3 చిత్రానికి జయకుమార్ రచనా సహకారం అందించాడు.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

తన కథతో వర్మ ఆఫిసర్ చిత్రాన్ని రూపొందించిందని జయ కుమార్ ఆరోపిస్తుంటే.. వర్మ అతడిపైనే కేసు నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పంజాగుట్ట పోలిసులని ఆశ్రయించిన వర్మ.. జయకుమార్ పై కేసు నమోదు చేశాడు.

కారణం ఇదే

కారణం ఇదే

జయకుమార్ తన ఫోటోలని మార్ఫింగ్ చేస్తున్నాడని వర్మ పోలిసులకు ఫిర్యాదు చేశాడు. నగ్నంగా ఉన్న మహిళల బూతు చిత్రాలకు తన తలని అంటించి వాటిని వైరల్ చేస్తున్నాడని వర్మ పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X