twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ స్కామ్ పై రామ్ గోపాల్ వర్మ సినిమా

    By Srikanya
    |

    నిజ జీవిత సంఘటనలు ఆధారంగా చిత్రాలు చేసే రామ్ గోపాల్ వర్మని తాజాగా నిత్యానంద స్కామ్ ఆకర్షించింది. గాడ్ అండ్ సెక్స్ టైటిల్ తో ఓ చిత్రం ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేస్తూ...అవును, నేను గాడ్ అండ్ సెక్స్ చిత్రాన్ని చేస్తున్నాను. రీసెంట్ గా బయిటపడ్డ ఓ సెక్స్ స్కాండిల్ ఆధారంగా చిత్రం చేస్తున్నాను. ఇలాంటి ఆలోచన నాలో చాలా కాలంగా ఉంది. అయితే స్వామి నిత్యానంద బయోపిక్ మాత్రం ఇది కాదు అని చెప్పారు. ఇక ఈ చిత్రం గురించి ఆయన మరింత విస్తారంగా మాట్లాడుతూ...గాడ్ అండ్ సెక్స్ ఓ ఎక్సప్లోర్, ఎక్సపోజ్ అంతేకాకుండా ఆశ్రమాల్లో ఉండే వ్యక్తులు గురించి చెప్తుంది అన్నారు.

    అలాగే నేను ఇలాంటి చాలా స్కాండిల్స్ ని గతం కొంత కాలంగా గమనిస్తున్నాను. ఆ అంశాలే ఈ చిత్రంలో చోటు చేసుకుంటాయి అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక ఈ చిత్రంలో ఎవరిని నటీనటులుగా తీసుకుంటారు అన్నదానికి వర్మ సమాధానమిస్తూ..అది కాస్ట కష్టమైన ప్రశ్న. మొదట నన్ను ఈ స్క్రిప్టు పూర్తి చేయనివ్వండి. ఆ తర్వాత నటుల ఎంపిక,సాంకేతిక నిపుణులు ని ఎప్రోచ్ అవటం చేస్తాను అన్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ఆవాహం త్వరలో రిలీజ్ కానుంది. అలాగే ఆయన ప్రస్తుతం రక్త చరిత్ర సెకెండ్ పార్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X