వర్మ హీరోయిన్ కి దెబ్బలు..

By Staff

Priyanka Chopra
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందిస్తున్న అజ్ఞాత్ షూటింగ్ లో ఓ చిన్న ప్రమాదం చోటుచేసుకుంది. హీరోయిన్ ప్రియాంకా కొఠారి అక్కడున్న చెరువులో దూకినప్పుడు అందులోని రాయి ఆమె మోకాలికి తగిలింది. దాంతో నిన్న(మంగళవారం)హఠాత్తుగా షూటింగ్ కాన్సిల్ చేసారు. ఈ విషయాన్ని చిత్రం ప్రొడక్షన్ మేనేజర్ చాలకూడి మణి మీడియాకు తెలియపరిచాడు.

ఇక డాక్టర్ ప్రియాంకా కొఠారి కు ప్రాధమిక చికిత్స చేసి ప్లాస్టర్ వేసి ఓ వారం రోజులపాటు రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చాడని చెప్తున్నారు. అందుకని షూటింగ్ లో ఆమె లేని సన్నివేశాలు ప్లాన్ చేయాలని డైరక్షన్ టీమ్ తలములకలైందని సమాచారం. ప్రస్తుతం ఈ టీమ్ మొత్తం కేరళలోని అంత్రిపల్లి ఫారెస్టులో ఉన్నారు. గతంలో వర్మ ఇక్కడ నిశ్శబ్ద్ షూటింగ్ జరిపారు. అంతేగాక మణిరత్నం రావణ్ షూటింగ్ కి కూడా ఈ లొకేషన్ నే ఎంచుకున్నారు. ఇక సినిమాకు సంభందించిన మేజర్ షూటింగ్ అంతా శ్రీలంక లోని సిరిగియా అడవిలో జరిగిందని చెప్తున్నారు. అత్రిపల్లి అడవి..కేరళలోని కొచ్చికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది.

నితిన్, ప్రియాంకా కొఠారి ఈ చిత్రంలో ప్రదాన పాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు ఆమె నిషా కొఠారి అనే పేరుతో పాపులర్ అయ్యింది.తాజాగా అది కలిసిరావటంలేదని మార్చుకుంది.అలాగే ప్రియాంక కొఠారి..జేమ్స్, వర్మకాషోలే, ఒక్క మగాడు చిత్రాల్లో నటించింది. ఇక స్టోరీ విషయానికి వస్తే అజ్ఞాతంగా ఉంటూ మనుషుల్ని చంపే ఓ శక్తి చుట్టూ అల్లుకొన్న కథ ఇది....ఓ సినిమా యూనిట్...షూటింగ్ కి వెళ్ళి ఓ దట్టమైన అరణ్యంలో చిక్కుకుపోతారు. అక్కడ ఒకరి తర్వాత మరొకరి హత్యలు జరుగుతూంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలియదు. అలా చంపుతున్నది జంతువా? మనిషా? ఏదైనా ప్రేతాత్మ? అన్నది సస్పెన్స్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X