twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టేజ్ మీదే ఏడ్చేసిన రామ్ గోపాల్ వర్మ.. లైఫ్ లో ఫస్ట్ టైం ఎమోషనల్!

    |

    వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి సరైన సినిమా వచ్చి చాలా కాలమైంది. ఎక్కువగా వివాదాస్పద సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ఆయన మొట్టమొదటిసారిగా లడికి అనే ఒక నాన్ కాంట్రవర్షియల్ సినిమా తెరకెక్కించారు. పూజ భలేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూలై 15వ తేదీన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, చైనా భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ తన జీవితంలోనే మొట్టమొదటిసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    అమ్మాయి పేరుతో

    అమ్మాయి పేరుతో


    రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో పూజ భలేకర్ నటించిన తాజా చిత్రం లడకి. తెలుగులో ఈ సినిమాను అమ్మాయి పేరుతో విడుదల చేస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్లో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో జరిగిన అమ్మాయి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకర్ శ్యామల హోస్ట్గా వ్యవహరించడంతో స్టేజిపై వర్మతో కలిసి అలరించింది.

    ఏకైక మగాడు

    ఏకైక మగాడు

    అయితే ఆమె ఒక ఫన్ గేమ్ ఆడించేందుకు వర్మతో ప్రయత్నం చేస్తే వర్మ సీరియస్ అవడంతో స్టేజ్ దిగిపోయాడు శ్యామల పై సీరియస్ అయిన వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఆ తర్వాత మాట్లాడిన వర్మ తన జీవితంలో బ్రూస్ లీ అనే వ్యక్తి చాలా కీలక పాత్ర పోషించాడని తాను ఆయన సినిమాలు చూసి ఆయన గురించి తెలుసుకుని చాలా ఎక్సైట్ అవుతూ ఉంటానని చెప్పుకొచ్చాడు. తాను గే కాదు కానీ నేను ముద్దు పెట్టుకోవాలి అనుకునే ఏకైక మగాడు బ్రూస్లీ మాత్రమేనని వర్మ చెప్పుకొచ్చాడు.

    దొరకడమే కష్టం

    దొరకడమే కష్టం

    తాను చేసిన శివ సినిమా బ్రూస్లీ చేసిన ఒక సినిమాను కాపీ కొట్టి చేశానని చెప్పుకొచ్చారు. అలా ఆయన వల్ల ఇన్స్పైర్ అయి చేసిన సినిమాలు చాలా ఉన్నాయి అన్నారు. తాను ఆయనని ఒక హీరోలా చూస్తానని అలాంటి ఆయనకు ఒక లేడీ ఫ్యాన్ ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచనతోనే ఈ సినిమా రూపొందించానని అన్నారు. మామూలుగానే మగ మార్షల్ ఆర్ట్స్ చేసేవారు దొరకడమే కష్టం.

    ఎమోషనల్ అవుతూ

    ఎమోషనల్ అవుతూ

    కానీ పూజ భలేకర్ ఎట్టకేలకు తమకు దొరికిందని సినిమా పూర్తి చేయడం కోసం కరోనా సమయం నుంచి దాదాపు రోజుకు 4, 5 గంటల పాటు ఆమె కష్టపడుతూ ఉండేదని వర్మ చెప్పుకొచ్చారు. పంజాగుట్ట నుంచి బ్రూస్లీ సినిమా చూడడం కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు సైకిల్ తొక్కుకుని వెళ్లే తాను అదే బ్రూస్ లీ గురించి ఒక సినిమా చేసి సుమారు 40000 చైనా థియేటర్లలో విడుదల చేస్తున్నానంటే ఇంకా అంతకంటే అచీవ్మెంట్ ఏం కావాలి అంటూ వర్మ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

    ఈ సినిమా అయినా

    ఈ సినిమా అయినా


    దీంతో వర్మని ఇలా చూసినా ఆయన ఫ్యాన్స్ కూడా చిన్న పిల్లాడురా మా వర్మ లోపల ఏమి పెట్టుకోకుండా బయటికి మాట్లాడతాడు అంటూ వర్మ ఎమోషనల్ అవడం తాము కూడా ఎమోషనల్ అవుతున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా అయినా వర్మకి సక్సెస్ తెచ్చి పెడుతుందేమో చూడాలి.

    English summary
    Ram Gopal Varma first time gets emotional cried in front of all on stage in ammayi pre release event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X