రాజమౌళి పొట్ట కొట్టేట్టు ఉన్నారే, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్.... జోకులేస్తూ ఘాటుగా వర్మ కౌంటర్!

టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్మ చేయబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై కామెంట్స్ చేశారు.

By Bojja Kumar

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విషయంలో టీడీపీ నేతల నుండి వస్తున్న విమర్శలను రామ్ గోపాల్ వర్మ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వారి విమర్శలను ఏమంత సీరియస్ గా తీసుకోని ఈ కాంట్రవర్సల్ డైరెక్టర్ తనదైన రీతిలో సెటైర్లు వేస్తూ సోషల్ మీడియా ద్వారా ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి... వర్మ చేయబోతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మీద కామెంట్స్ చేయడంతో వర్మ తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు.

ప్రభాకర్ చౌదరి: రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఓ సైకో.

ప్రభాకర్ చౌదరి: రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఓ సైకో.

ఆర్జీవీ : అవునా డాక్టర్ గారు ..మీకు సైకియాట్రీ మీద డిగ్రీ కూడా ఉందా? అరెరే మీరు చదువు రాని వారనుకున్నాను ..సారి నా బాడ్

Recommended Video

Ram Gopal Varma funny pic like Arjun Reddy Goes Viral
ప్రభాకర్ చౌదరి: కులాల మధ్య, రాజకీయాల మధ్య ఇష్టం వచ్చినట్లు సినిమాలు తియ్యకూడదు.

ప్రభాకర్ చౌదరి: కులాల మధ్య, రాజకీయాల మధ్య ఇష్టం వచ్చినట్లు సినిమాలు తియ్యకూడదు.

ఆర్జీవీ : అంటే ఇష్టం లేనట్టు తీస్తే, ఓకేనా డాక్టర్ గారు?

ప్రభాకర్ చౌదరి: సినిమా తీసేటప్పుడు అన్ని రాజకీయ పక్షాలను పిలిచి మాట్లాడాలి

ప్రభాకర్ చౌదరి: సినిమా తీసేటప్పుడు అన్ని రాజకీయ పక్షాలను పిలిచి మాట్లాడాలి

ఆర్జీవీ :ఇంతకన్న సైకో కామెంట్ బహుశా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పేషెంట్లు కూడా ఇఛ్చి వుండరు

 ప్రభాకర్ చౌదరి: రామారావు వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేసే విధంగా మూవీ ఉండాలి

ప్రభాకర్ చౌదరి: రామారావు వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేసే విధంగా మూవీ ఉండాలి

ఆర్జీవీ : ఛా మా నాయనే.. ఎవరికి తట్టని ఎంత గొప్ప మాట చెప్పావు చౌదరి ..నీ కడుపు చల్లగుండ

ప్రభాకర్ చౌదరి: ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి మచ్చ కలిగే రీతిలో ఏమి తీసినా తగిన మూల్యం చెల్లించుకుంటావు

ప్రభాకర్ చౌదరి: ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి మచ్చ కలిగే రీతిలో ఏమి తీసినా తగిన మూల్యం చెల్లించుకుంటావు

ఆర్జీవీ : అంటే మీ జేబులనిండా డబ్బులు నింపితే NTR గారిని తిట్టినా పర్వాలేదా ? నీ తస్సాదియ్యా

ప్రభాకర్ చౌదరి: నా సినిమా నా ఇష్టం అంటే చూస్తు ఊరుకోం.

ప్రభాకర్ చౌదరి: నా సినిమా నా ఇష్టం అంటే చూస్తు ఊరుకోం.

ఆర్జీవీ : ఊరుకోక డాన్స్ చేస్తారా సార్? లేక పాట కూడా పడతారా?

ప్రభాకర్ చౌదరి: దర్శకుడంటే తన సినిమా ద్వారా ప్రేక్షకులను ఆనందింపజేయాలి.. రంజింపజేయాలి. సందేశాత్మక చిత్రాలతో సమాజానికి ఉపయోగపడాలి.

ప్రభాకర్ చౌదరి: దర్శకుడంటే తన సినిమా ద్వారా ప్రేక్షకులను ఆనందింపజేయాలి.. రంజింపజేయాలి. సందేశాత్మక చిత్రాలతో సమాజానికి ఉపయోగపడాలి.

ఆర్జీవీ : అబ్బో సినిమా పట్ల మీకున్న ఈ అత్యంత అమోఘమైన అవగాహన చూస్తుంటే రాజమౌళి పొట్ట కూడా కొట్టేడట్టు వున్నారు మీరు..బాబోయ్

ప్రభాకర్ చౌదరి: లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా వెనుక వైసీపీ హస్తం ఉంది.

ప్రభాకర్ చౌదరి: లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా వెనుక వైసీపీ హస్తం ఉంది.

ఆర్జీవీ : ఆ హస్తం వెనక మీ హస్తం ఉందా సార్? లేకపోతే మీకెలా తెలుసు ఎవరి వెనుక ఎవరున్నారో ? అయినా ముందు వెనకాలవున్న ,వెనక ముందు గ్రూపుల గురించి మీ వెనకున్న గ్రూపులకి బాగా తెలుసని నాకు కూడా తెలుసని మీకు కూడా తెలుసు..ఈ కామెంట్ని అర్ధం చేసుకునే మైండ్ మీకు లేకపోతే నేను మిమ్మల్ని అలా వెనక్కి తీసుకెళ్లి చెప్తా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X