రాంగోపాల్ వర్మ మెడకు బిగుస్తున్న ఐటీ కేసు ఉచ్చు.. ఆర్జీవికి ఏపీ పోలీసుల నోటీసులు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో జనసేన, తెలుగు దేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు చేసినందుకు గాను ఆయనకు ఏపీ పోలీసులు స్వయంగా నోటీసులు అందజేశారు. హైదరాబాద్‌లోని ఆయన ఆఫీస్ ఆర్జీవి డెన్‌లో పోలీసులు కలిసి నోటీసును అందించారు. విచారణకు హాజరుకావాలని ఆయనను కోరారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
గత వైసీపీ ప్రభుత్వ హాయంలో చంద్రబాబు, లోకేష్ నారా, పవన్ కల్యాణ్ తదితర నేతలపై ఆర్జీవి తీవ్ర పదజాలంలతోను అలాగే మార్పింగ్ ఫోటోలతో కించపరుస్తూ పోస్టులు పెట్టారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులు అలాంటి పోస్టులపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవికి కూడా నోటీసలులు జారీ చేశారు.

తెలుగుదేశం, జనసేన నేతలు, అలాగే పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్‌పై అసభ్యకరంగా అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలి అని టీడీపీ నేత రామలింగం మద్దిపాడులో కేసు నమోదు చేయడం తెలిసిందే.
చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆర్జీవి రూపొందించిన వ్యూహం సినిమా ప్రమోషన్లలో ఆయన పలు రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నారా బ్రాహ్మణి పైన కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనే ఆరోపణల ఆధారంగా పోలీసులు ఐటి చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మపై మద్దిపాడులో నమోదైన కేసులో ఆయనకు నోటీసులు అందజేశారు.


Click it and Unblock the Notifications











