»   » శ్రీదేవికి వర్మ ప్రేమలేఖ: మండిపడ్డ బోనీ కపూర్

శ్రీదేవికి వర్మ ప్రేమలేఖ: మండిపడ్డ బోనీ కపూర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: పలు వివాదాలకు మూల బిందువుగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...తనకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో గతంలో చాలా సందర్భాల్లో బహిరంగంగానే వెల్లడించారు. తాజాగా విడుదలైన తన జీవిత కథ 'గన్‌ అండ్ థైస్‌'లో ఏకంగా ఒక చాప్టర్‌ నే ఆమెకు అంకితం ఇచ్చాడు. శ్రీదేవిని 'సౌందర్య దేవత'గా అభివర్ణిస్తూ.. ఆమె పట్ల తనకు ఉన్నది స్వచ్ఛమైన అభిమాన అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే ఈ పుస్తకంలో శ్రీదేవిపై రాసిన చాప్టర్ ఆమెకు తాను రాసిన ప్రేమలేఖ లాంటిదని, ఆమె పట్ల తనకున్న ఆకర్షణ ఒక డ్రగ్స్‌ లాంటిందంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. బోనీ కపూర్ కిచెన్ లో శ్రీదేవి టీ పెడుతుండటం చూసి విస్మయానికి గురయ్యాను. దివిలో ఉన్న ఓ దేవతను తన అపార్ట్ మెంట్ లోని కిచెన్ స్థాయికి దించేసిన బోనీ కపూర్ ను నేను ఎప్పటికీ క్షమించను అని వర్మ పుస్తకంలో రాసాడు.

అయితే వర్మ తీరుపై శ్రీదేవి భర్త బోనీ కపూర్ మండి పడ్డారు. రామ్ గోపాల్‌ వర్మ ది వెర్రి మనస్తత్వం, వికృత మనస్తత్వం అంటూ బోనీ విరుచుకుపడ్డారు. పబ్లిసిటీ కోసమే అతను ఇలా చేస్తున్నట్లు బోనీ ఆరోపించారు.

Ram Gopal Varma has perverted mindset: Boney Kapoor

వర్మ తన ఆత్మ కథలో ఇంకా చాలా విషయాలు పొందు పరిచాడట. క‌థానాయిక‌ల‌తో, మాఫియాతో త‌న‌కున్న లింకుల్ని ఈ పుస్త‌కంలో బ‌య‌ట‌పెట్ట‌నున్నాడు వ‌ర్మ‌. అయితే.. ఇందులో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన కొన్ని రహ‌స్యాలున్నాయ‌ని తెలుస్తోంది. వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో చిరంజీవి క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం అప్ప‌ట్లో పట్టాలెక్కి కొంత మేర షూటింగ్ జ‌రుపుకొని ఆగిపోయింది. ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది? కార‌ణం ఏమిట‌న్న విష‌యాన్ని వ‌ర్మ ఈ పుస్త‌కం ద్వారా బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌బోతున్నాడ‌ట‌.

అంతేకాదు, చిరంజీవిపై త‌న‌కున్న అభిప్రాయాన్ని నిర్మొహ‌మాటంగా ప్ర‌స్తావించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. చిరుపై కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌బోతున్నాడ‌న్న‌ది ఇన్ సైడ్ టాక్‌. మ‌రి ఆ వ్యాఖ్య‌లు ఏమైఉంటాయా అని మెగా ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి వ‌ర్మ ఈ పుస్త‌కాన్ని గ‌ర‌మ్ గ‌ర‌మ్ అంశాల‌తో సిద్ధం చేయ‌బోతున్నాడ‌న్న‌మాట‌.

English summary
Boney Kapoor irked by Ram Gopal Varma comments and said “He (RGV) has gone bonkers, crazy and he has a perverted mindset, what do you do with such a person? He has done whatever he wanted to, maybe he wanted publicity, but I don’t want to react and give him any further publicity.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu