రామ్ గోపాల్ వర్మ ‘మరియా’ సినిమాతో హౌస్ అరెస్ట్...!?
రామ్ గోపాల్ వర్మ 'నాట్ ఏ లవ్ స్టోరీ" అనే చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. నీరజ్ గ్రోవర్ మర్డర్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో నీరజ్ హత్యకు సంబంధించి దోషిగా భావిస్తున్న మారియా సూసైరాజ్ ని ఈ చిత్రంలో నటింపజేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దీన్ని నీరజ్ తండ్రి అమరనాథ్ గ్రోవర్ తో పాటు పలు రాజకీయనాయులు కూడా తప్పుపడుతున్నారు. అలాగే చిత్ర పరిశ్రమ నుంచి కూడా భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
అలాగే రామ్ గోపాల్ వర్మపై చాలా మంది ఆగ్రహంగా ఉన్నారట. అయితే తానేమి భయపడలేదని. ఇలాంటివి నేను ఇంతకమునుపు చాలానే చూశాసని అంటున్నాడు. అయితే ఇంకా తను ఇంకా మారియాను కలవలేదని, త్వరలో కలుస్తానని చెబుతున్నాడు. ఈ నేపధ్యంలో తనకు పోలీసు సెక్యూరిటీ కావాలని రామ్ గోపాల్ వర్మ కోరడం జరిగింది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా తనకు తానే హౌస్ అరెస్ట్ లో ఉంటున్నాడని తెలుస్తోంది. పోలీసులు సెక్యూరిటి ఇచ్చిన తర్వాత గడపదాటాలని భావిస్తున్నాడట.


Click it and Unblock the Notifications











