Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RGV vs Perni Nani మీ విధానాలతో ఆంధ్ర ప్రదేశ్‌కు అలాంటి ముప్పు.. రాంగోపాల్ వర్మ హెచ్చరిక
టాలీవుడ్, ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు అంశంపై కొద్ది నెలలుగా కొనసాగుతున్న వివాదం మరోస్థాయికి వెళ్లేటట్టు కనిపిస్తున్నది. తొలుత రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మొదలైన ఈ వివాదం.. తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రెస్‌మీట్‌లో నాని చేసిన వ్యాఖ్యల వరకు అనేక మలుపులు తిరుగుతున్నది. తాజాగా ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో జరిగిన చర్చ అనంతరం ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది. వర్మ వర్సెస్ పేర్ని నానిగా మారిన ట్విట్టర్ వార్‌లో ఇద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన వాదనలు ఇలా ఉన్నాయి.
సినిమా థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి అని మంత్రి పేర్ని నాని చేసిన ట్వీట్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ..
మీరు చెప్పేది 100% కరెక్ట్. అలాంటప్పుడు V EPIC థియేటర్‌లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్ ఉన్న ఏరియా బట్టి టికెట్ ప్రైజ్ ఎలా పెట్టారు? ఈ కింది ట్వీట్‌లో మీరు చెప్పింది మీకు అర్థమైతే ఇంక సమస్య లేనట్టే.. వివిధ హోటల్స్‌లో ఆయా హోటల్ యజమానులు, వాళ్ళిచ్చే సౌకర్యాలను బట్టే ప్రైజ్ లిస్ట్ పెట్టుకుంటారు అని తన ట్వీట్‌లో వర్మ అన్నారు.

గతంలో రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌కు మంత్రి నాని ట్వీట్ చేస్తూ.. మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని, మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు. సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు. సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ? అని అన్నారు.
అయితే పేర్ని నాని ట్వీట్‌కు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు.. కానీ దాని కోసం పేదల్ని ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చెయ్యాలి కానీ ఉన్న ధనికుల్ని పేదల్ని చెయ్యకూడదు.. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే పేద రాష్ట్రంగా అయ్యే ప్రమాదముంది అని వర్మ హెచ్చరించారు.
ఇక తన ట్వీట్లపై సానుకూలంగా, సమయస్పూర్తిగా సమాధానాలు ఇచ్చిన పేర్ని నానిని వర్మ అభినందించారు. పేర్ని నాని గారు మీ పార్టీలో కొందరు మిగతా లీడర్లలాగా అడ్డంగా తిట్లతోనో పర్సనల్ విషయాల మీద దూకడం కాకుండా డిగ్నిటీతో సామరస్యం పాటించినందుకు ఇంకోక్కసారి నా ధన్యవాదాలు. ఒక అంగీకారం అనేది లాజిక్ ఇచ్చిపుచ్చుకున్నప్పుడే వస్తుంది అని వర్మ అన్నారు.
ఇక అంతటితో వర్మ ఆగకుండా నేను యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్‌ని, @perni_nani garu ఎకనామిక్స్ గురించి నాకు ఏ బీ సీ తెలియదు. కానీ అనుమతిస్తే మీ ప్రభుత్వంలో టాప్ ఆర్థిక నిపుణులతో నేను టెలివిజన్ డిబేట్‌కి రెడీ.. మా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఏర్పడ్డ అపోహలను తొలగిపోవడానికి చర్చ అవసరం.. థ్యాంక్యూ అని రాంగోపాల్ వర్మ సూచించారు.