మియా మాల్కోవా తర్వాత బెస్ట్ బాడీ ఇదే: ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌పై ఆర్జీవీ హాట్ కామెంట్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన చిత్రాలకు బ్రాండ్ అంబాసీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. సినీ పరిశ్రమకు పరిచయం అయిన తొలినాళ్లలో ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుని తక్కువ వ్యవధిలోనే స్టార్ డైరెక్టర్ అయ్యారాయన. ఆ తర్వాత పంథా మార్చుకుని సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. ఇక, కొన్నేళ్లుగా వివాదాస్పద చిత్రాలు తెరకెక్కిస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ ద్వారా ఓ స్టార్ ఫొటోను షేర్ చేసి హాట్ కామెంట్స్ చేశాడు వర్మ. ఆ వివరాలు మీకోసం.!

రాజకీయాలపై ఫోకస్.. వివాదాలతో సహవాసం
చాలా కాలం పాటు క్రేజీ సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు రాంగోపాల్ వర్మ. అయితే, కొంత కాలంగా ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలనే తీస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా వివాదాల్లో చిక్కుకున్నారు. అంతేకాదు, సినిమాల విడుదలకు అడ్డంకులు ఏర్పడినా అటువంటివే తీస్తూ ముందుకు వెళ్లారు. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

అక్కడ యమ యాక్టివ్.. బెదరని మనస్తత్వం
రాంగోపాల్ వర్మకు సోషల్ మీడియా మంచి ఫ్లాట్‌ఫాంలా దొరికింది. అందుకే సినిమాలు చేస్తూ ఉన్నా.. అందులో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న ఆయన.. సామాజిక మాధ్యమాల్లో కూడా భిన్నంగా వ్యవహరిస్తుంటాడు. తన వ్యక్తిగతం అంశాలను పక్కన పెట్టి ఇతరులపై తరచూ ఏవో ఒక కామెంట్లు చేస్తూనే ఉంటాడు.

న్యూడ్ సినిమాతో సంచలనం.. మళ్లీ ఆమెతోనే
గతంలో రాంగోపాల్ వర్మ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో న్యూస్ మూవీ తీసి సంచలనం సృష్టించాడు. ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా డైరెక్టుగా ఆన్‌లైన్‌లోనే విడుదలైంది. ఈ చిన్న మూవీ ద్వారా ఆయన కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందాడు. ఈ క్రమంలోనే మరోసారి మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్' అనే సినిమా చేస్తున్నాడు.

ఆమె అందంతో ప్రయోగం.. ఈసారి థ్రిల్లర్‌గా..
గతంలో మియా మాల్కోవాతో న్యూడ్ సీన్స్‌తో ‘జీఎస్టీ' అనే సినిమాను రూపొందించిన ఆర్జీవీ.. తాజాగా ఆమెతోనే ‘క్లైమాక్స' అనే మూవీ రూపొందిస్తున్నాడు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మే 29న విడుదల చేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు.
Recommended Video

మియా తర్వాత నేను చూసిన బెస్ట్ బాడీ ఇదే
సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే రాంగోపాల్ వర్మ.. తాజాగా ఓ స్టార్‌ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశాడు. ఆ స్టార్ మరెవరో కాదు... నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. అతడి సిక్స్ ప్యాక్ ఫొటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఆర్జీవీ.. ‘మియా మాల్కోవా తర్వాత నేను చూసిన బెస్ట్ బాడీ ఇదే' అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది.
ఆయన లీక్ చేసిన ఫొటోనే ఇది.. క్రేజీగా ఉంది
వాస్తవానికి ఈ ఫొటోను ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ విడుదల చేశాడు. చాలా కాలం నుంచి ఎన్టీఆర్‌కు పర్సనల్ ట్రైనర్‌గా పని చేస్తున్న ఆయన.. ఈ అన్‌సీన్ ఫొటోను తాజాగా సోషల్ మీడియాలో వదిలాడు. బుధవారం తారక్ పుట్టినరోజు కాబట్టి.. దానిని పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే లాయిడ్ ఈ ఫొటోను నందమూరి అభిమానులతో పంచుకున్నాడు.


Click it and Unblock the Notifications











