తప్పు చేయనప్పుడు తలవంచాలా? ఎవరి అనుమతి అవసరం లేదు.. ఆర్జీవి
దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ లాక్‌డౌన్‌ను పాటిస్తుంటే రాంగోపాల్ వర్మ మాత్రం అందరికీ షాకిచ్చారు. లాక్‌డౌన్‌లో సినిమాను పూర్తి చేసి రిలీజ్‌కు సిద్దమయ్యారు. తాజాగా కరోనావైరస్ అనే సినిమాను లాక్‌డౌన్‌లో చిత్రీకరించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను తీసుకొన్న నిర్ణయంలో ఎలాంటి లొసుగులు లేవన, నిబంధనల ప్రకారమే షూట్ చేశానని చెబుతూ..

లాక్‌డౌన్‌లోనే కరోనావైరస్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగానే నేను కరోనావైరస్ సినిమాను చిత్రీకరించాను. సినిమా పరిశ్రమకు సంబంధించిన ఏ యూనియన్ సభ్యుడిని షూటింగ్ కోసం తీసుకోలేదు. ఎవరినీ సంప్రదించలేదు. మా పరిధిలో అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకొని సినిమాను షూట్ చేశాం అని రాంగోపాల్ వర్మ ఇటీవల మీడియాతో అన్నారు.

నిబంధనలకు అనుగుణంగానే
కరోనావైరస్ మూవీని లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత వారం అనంతరం ప్రారంభించాం. ప్రభుత్వం జారీ చేసిన అన్ని రకాల లాక్‌డౌన్ నిబంధనలు పాటించాం. లాక్‌డౌన్ ముగిసే లోపునే సినిమాను కంప్లీట్ చేశాం. నిబంధనలకు అనుగుణంగా నడచుకొన్నప్పుడు ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదు. తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచనవసరం లేదు అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

విపత్కర పరిస్థితుల్లో ఇన్నోవేటివ్‌గా
ఇలాంటి విపత్కర పరిస్థితులను నా ఆలోచనలు, విజన్‌కు అనుగుణంగా మలచుకొన్నాను. నీ పనిని మరింత ఇన్నోవేటివ్‌గా చేయడానికి ఈ సమయం కరెక్ట్. అవసరాలు మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తాయి. నిబంధనలు అతిక్రమించలేదు. అందుకే ఎవరి అనుమతి తీసుకోలేదు. కొవిడ్ 19 నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాం అని రాంగోపాల్ వర్మ తెలిపారు.
Recommended Video

ఓటీటీ కోసం వెబ్ సిరీస్
అలాగే క్లైమాక్స్ అనే చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ చేస్తున్నాను. మియా మాల్కోవా నటించిన ఈ మూవీని శ్రేయాస్‌ఈటీ అనే యాప్‌లో రిలీజ్ చేయనున్నాం. నేను యూట్యూబ్ కోసం సినిమా తీయలేదు. ఇక ముందు ఓటీటీ కోసం వెబ్ సిరీస్ చేస్తాను. త్వరలోనే ఆర్జీవీ వరల్డ్ అనే సొంత ఫ్లాట్‌ఫాంను ప్రారంభించబోతున్నాను అని వర్మ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











