twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ పిచ్చివాడయ్యాడా?.. శ్రీదేవి మరణంతో 50కిపైగా వరుస ట్వీట్లు.. దేవుడిపై తిట్ల వర్షం..

    By Rajababu
    |

    Recommended Video

    Sridevi : నాకు ఆ పిల్ల అంటే ఇష్టం, ఆ పిల్లకి ఏం అన్న అయితే ?

    అందాల తార శ్రీదేవి అంటే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు పిచ్చి. తన అందాన్ని ఆరాధించే వ్యక్తుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సమయం చిక్కినప్పుడల్లా శ్రీదేవి అందం గురించి వ్యక్తిగతంగానో, సోషల్ మీడియాలోనూ ఆయన వ్యక్తీకరిస్తుంటాడు. అంతగా అభిమానించే శ్రీదేవి ఇకలేరనే విషయాన్ని ప్రస్తుతం జీర్ణించుకోలేకపోతున్నారు. వరుస ట్వీట్లతో తన బాధను వెళ్లగక్కుతున్నారు..

    దేవుడిని ద్వేషించినంతగా

    దేవుడిని ద్వేషించినంతగా

    శ్రీదేవి మరణవార్త వినగానే రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇదే.. ఈ రోజు దేవుడిని ద్వేషించినంతగా నేను ఎప్పుడూ ద్వేషించలేదు. నా ఆశాకిరణాన్ని దేవుడు ఆర్పివేశాడు. బోనికపూర్‌కు నా తీవ్ర సంతాపం అని ట్వీట్ చేశారు.

    పీడకల నుంచి

    పీడకల నుంచి

    శ్రీదేవి మరణించిందా? నన్న ఓ వ్యక్తి లేపి.. నాకు ఆ వార్త చెప్పినప్పుడు నేను పీడకల కంటున్నానా అనిపించింది అని మరోట్వీట్ చేశాడు. మనల్ని అలా వదిలేసి వెళ్లడం సరైనదా మీరే చెప్పండి అంటూ మరో ట్వీట్ చేశాడు.

     బ్లాగులో భారీ వ్యాసం

    బ్లాగులో భారీ వ్యాసం

    శ్రీదేవిని చంపిన దేవుడుంటే నాకు అసహ్యం. అలాగే ఇలా మరణించిన శ్రీదేవి అంటే కూడా కోపంగా ఉందని తన బ్లాగులో భారీసైజులో ఓ వ్యాసం రాశాడు కూడా అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నాడు. నీవు ఎందుకు ఏడుస్తావు.. నీవు చేసినదానికి మేమంత జీవితాంతం ఏడువాల్సి ఉంటుంది అని వరుస ట్వీట్లు చేశాడు.

    శ్రీదేవి కారణమని..

    శ్రీదేవి కారణమని..

    సినిమా పరిశ్రమకు రావడానికి ప్రధాన కారణం శ్రీదేవినే. ఆమెను చాలా దగ్గరగా చూడటానికి వీలు అవుతుంది అనే ఉద్దేశంతో నేను సినిమాల్లోకి వచ్చాను. క్షణక్షణం సినిమా శ్రీదేవికి రాసిన నా ప్రేమలేఖ అని వర్మ ఓ ట్వీట్ చేశారు.

     బాలాజీతో ఆర్జీవి మొర

    బాలాజీతో ఆర్జీవి మొర

    గోవిందా గోవిందా సినిమా షూటింగ్ సందర్బంగా బాలాజీ విగ్రహం ముందు శ్రీదేవితో దిగిన ఫొటోను రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఓ బాలాజీ.. నన్ను ఇక్కడే వదిలేసి.. ఆమె ఒక్కరినే ఎందుకు తీసుకెళ్లావు అని మరో ట్వీట్ చేశారు.

     శ్రీదేవి కాళ్లకు దండం

    శ్రీదేవి కాళ్లకు దండం

    క్షణ క్షణం షూటింగ్ సమయంలో శ్రీదేవి ఒక అద్బుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌ను ఇచ్చింది. అప్పుడు శ్రీదేవి నటనకు ముగ్ధుడైన నేను ఆమె కాళ్లకు దండం పెడుతుండగా హీరో వెంకటేష్ ఆపినాడు అంటూ వర్మ మరో ట్వీట్ చేశాడు.

    నా కొంప ముంచాడు

    నా కొంప ముంచాడు

    అమ్మ బ్రహ్మ దేవుడో.. నీకు పోయే కాలం ఏమొచ్చింది. నా కొంప ముంచావు అంటూ గోవిందా గోవిందా చిత్రంలోని పాటను అనుసరిస్తూ ఓ ట్వీట్ చేశాడు.

     దేవుడు అహంభావి..

    దేవుడు అహంభావి..

    నా దృష్టిలో దేవుడు అహంభావి. తన పవర్‌ను చూపించుకోవడానికి అవసరం లేకున్నా బ్రూస్‌లీ, శ్రీదేవి లాంటి అద్భుతమైన వ్యక్తులను చంపేస్తుంటాడు. ఈ విషయంలో దేవుడికి బ్రూస్‌లీ రెండు కిక్స్ ఇవ్వాలని నేను ప్రార్ధిస్తున్నాను. ఒకటి తనను చంపినందుకు, రెండోది శ్రీదేవిని చంపినందుకు అని మరో ట్వీట్ చేశాడు.

     శ్రీదేవి కళ్లపై కొరియోగ్రఫి

    శ్రీదేవి కళ్లపై కొరియోగ్రఫి

    ఇప్పటివరకు నా సినీ కెరీర్‌లో నేను తీసిన పాట క్షణక్షణం చిత్రంలోని జామురాతిరి అనే పాట. కీరవాణి స్వరపరిచిన పాటను ప్రతీ ఒక్కరికి ఇష్టమైన విధంగా రూపొందించాం. ఆమె కళ్లతో హావభావాలు పలికించే విధంగా కోరియోగ్రఫిని చేశాం అని వర్మ మరో ట్వీట్ చేశాడు.

     అర్జున్ రెడ్డి డైలాగ్‌తో

    అర్జున్ రెడ్డి డైలాగ్‌తో

    శ్రీదేవి మరణం తర్వాత నాకు అర్జున్‌రెడ్డి సినిమాలోని డైలాగ్ గుర్తుకు వచ్చింది. ‘అరేయ్ నాకు ఆ పిల్ల అంటే ఇష్టం. మనకు ఏమైనా ఎఫెక్ట్ అయితే, మనం పోతే.. ది మోస్ట్ అఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు. అది నా లైఫ్‌లో ఆ పిల్ల. ఆ పిల్లకి ఏం అన్న అయితే, ఐ విల్ బీ ది మోస్ట్ అఫెక్టెడ్.. అండర్‌స్టాండ్.

     50కి పైగా వరుస ట్వీట్లు

    50కి పైగా వరుస ట్వీట్లు

    శ్రీదేవి మరణవార్త తెలిసిన తర్వాత రోజంతా రాంగోపాల్ వర్మ ట్వీట్లు చేస్తూనే గడిపాడు. దాదాపు 50కి పైగా ట్వీట్లు చేసి ఉంటారు. భావోద్వేగాలు నాకు లేవు అని చెప్పుకొనే ఆర్జీవి.. ఇలా శ్రీదేవి దూరకావడాన్ని జీర్ణించుకోలేకపోవడం చర్చనీయాంశమైంది.

    English summary
    Sridevi Boney Kapoor, the celebrated Bollywood actor whose contributions to Indian cinema won her a Padma Shri award, died of a massive cardiac arrest in Dubai on Saturday. Bollywood director Ram Gopal Varma today posted a heart-wrenching, passionate letter narrating his memories of the Hawa Hawai girl.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X