For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పిచ్చి ముండాకొడుకు అని అమ్మాయిలు వెంటపడుతున్నారు.. పాపాలు చేశా.. నరకానికే వెళ్తా.. వర్మ

  By Rajababu
  |

  లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రంతో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. ఎందుకంటే ఆ చిత్రం నటరత్న నందమూరి తారక రామారావు జీవిత చిత్ర కావడం. ఈ సినిమా ప్రారంభం కాకముందే అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తాజాగా ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బయోపిక్ గురించి, వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం గురించి వెల్లడించారు. అవేమిటంటే..

   అందుకే చింపిరి జుట్టుతో

  అందుకే చింపిరి జుట్టుతో

  కాలేజ్ డేస్‌లో నేను అందగాడిని కాదు. ఓ మోస్తారుగా కనిపించే వాడిని. అందుకే అమ్మాయిలు వెంటపడేవారు కాదు. అందంగా తయారవ్వడం వల్ల వర్కవుట్ కాదని డిసైడ్ అయ్యాను. చింపిరి జట్టుతో కనిపించే వాడిని. ఎందుకంటే మేధావి బిల్డప్ ఇవ్వడానికి మాత్రమే.

   అందుకే అమ్మాయిలు వెంటపడుతున్నారు.

  అందుకే అమ్మాయిలు వెంటపడుతున్నారు.

  ఇప్పుడు అమ్మాయిలు ఎందుకు వెంటపడుతున్నారంటే.. వాళ్లు నన్ను పిచ్చి ముండాకొడుకు అని ఫిక్స్ అయ్యారు. అమ్మాయిలకు కూడా పిచ్చి ఉంటుంది. అందుకే వాళ్లు నా వెంటపడుతున్నారు.

   అంతకన్నా చెడ్డవాడిని నేను

  అంతకన్నా చెడ్డవాడిని నేను

  నా భార్యతో విడాకులు తీసుకొన్న ఏడేళ్ల తర్వాత నా కూతురిని కలిశాను. అప్పుడు నేను నా కూతురితో ఏమన్నాన్నంటే.. నువ్వు నా గురించి ఎంత విన్నావో అంతకన్నా చెడ్డవాడిని నేను. నేను స్వార్ధపరుడిని. అసాంఘిక పనులను థియరిటికల్‌గా గౌరవిస్తాను అని చెప్పాను.

   పవన్ కల్యాణ్ కంటే విజయ్ దేవరకొండ

  పవన్ కల్యాణ్ కంటే విజయ్ దేవరకొండ

  అర్జున్ రెడ్డి చిత్రం చూసిన తర్వాత పవన్ కల్యాణ్ కంటే విజయ్ దేవరకొండ మంచి నటుడు అనే అభిప్రాయానికి వచ్చాను. అదే విషయాన్ని నేను ట్వీట్ చేశాను. అది ఒక ప్రేక్షకుడిగా నేను ఫీలయ్యాను. చిరంజీవి ఫ్యామిలీ మీద నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. సెలబ్రిటీలు అన్నప్పుడు ప్రతీ ఒక్కరికి ఓ అభిప్రాయం ఉంటుంది.

   సినిమా హిట్ అయితే

  సినిమా హిట్ అయితే

  నా సినిమాలు ఫ్లాప్ అయితే పెద్దగా పట్టించుకొను. సినిమా హిట్ అయితే ఎందుకు హిట్ అయింది అని ఆలోచిస్తాను. శివ ఎందుకు హిట్ అయింది అనే విషయం ఇప్పటికీ నాకు పెద్ద మిస్టరీ. ఫ్లాప్‌ను నేను లైట్‌గా తీసుకొంటాను.

   నేను దేవుడిని నమ్మను

  నేను దేవుడిని నమ్మను

  నాకు ప్రపంచంతో సంబంధం లేదు. నా కళ్లతో చూసేదే నాకు ప్రపంచం. నేను దేవుడిని నమ్మను. నేను నాస్తికుడిని. నేను చనిపోయిన తర్వాత జీసస్, అల్లా ఇంకా ఏ దేవుడైనా కనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాను. నేను చాలా పాపాలు చేశాననే విషయం నాకు తెలుపు. అందుకే నేను ఖచ్చితంగా నరకానికి పోతాను అని నమ్ముతాను.

   లక్ష్మీపార్వతి వీడియోలు చూసినప్పుడు

  లక్ష్మీపార్వతి వీడియోలు చూసినప్పుడు

  ఎన్టీఆర్ బయోపిక్ తీయాలని అనుకొన్నప్పుడు నాకు ఎలాంటి ఆలోచన లేదు. కానీ ఇంటర్నెట్‌లో లక్ష్మీపార్వతి వీడియోలు చూసినప్పుడు ఓ ఆలోచన కలిగింది. అప్పుడే ఈ చిత్రంపై క్లారిటీ వచ్చింది.

   ఎన్టీఆర్ కష్టాలు పడినట్టు

  ఎన్టీఆర్ కష్టాలు పడినట్టు

  నాకు తెలిసినంత వరకు సినిమాల పరంగా ఎన్టీఆర్ ఎక్కడ కష్టాలు పడిన దాఖలాలు లేవు. కానీ జీవితం చివర్లో ఓ అసాధారణ మనిషి.. చాలా సాధారణంగా సమస్యలను ఎదుర్కోవడం ఓ టెరిఫిక్ డ్రామా అనే ఫీలింగ్ కలుగుతుంది.

  English summary
  Sensational Director Ram Gopal Varma revealed about NTR Biopic Lakshmi's NTR. He speaks to media about his plans about the movie. Varma also said few things in his personal and professional life.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X