శివుడి అవతారంతో రాంగోపాల్ వర్మ హల్‌చల్.. శివరాత్రి రోజు తలపై శ్రీదేవీతో... ఏం జరిగిందంటే!
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో మరోసారి వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. భక్తి, దైవం, కుటుంబం లాంటి అంశాలను తనకు పట్టవని చెప్పే ఈ జీవి.. ఏకంగా శివుడి రూపం ఎత్తారు. మహాశివరాత్రి పండుగ రోజున శివుడి రూపంలో ఉన్న మార్పింగ్ ఫోటోలతో హల్‌చల్ చేశారు. ఇంతకు ఆర్జీవి శివరాత్రి రోజు చేసిన సందడి ఏమింటంటే...

ఫోటోను చూసి అసహ్యంగా
మీరు శివరాత్రి రోజు సంతోషంగా ఉండోద్దని కోరుకొంటున్నాను. నేను పోస్టు చేసిన ఫోటోను చూస్తే తప్పకుండా ప్రతీ ఒక్కరు అసహ్యించుకొంటారు. యాదృచ్చికంగా ఉద్దేశపూర్వకంగానే యాక్సిడెంటల్‌గా పోస్టు చేసిన ఫోటో ఇది. లార్డ్ శివను కీర్తించండి అంటూ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి
రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేసి.. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి శివ గోపాల్ వర్మ. అతడి గురించి సమాచారం కావాలంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తెలుసుకోండి అంటూ మరో కామెంట్ చేశాడు. వర్మ చేసిన కామెంట్లపై నెటిజన్లు ఘాటుగా కొందరు.. హాస్యంతో కొందరు కామెంట్లు చేస్తున్నారు.

తలపై గంగమ్మకు బదులు శ్రీదేవి
రాంగోపాల్ వర్మ మరో మార్ఫింగ్ ఫోటోను ట్వీట్ చేసి ఆసక్తికరమైన కామెంట్‌ను పెట్టారు. శివుడి రూపంలో ఉన్న తన బొమ్మ తలపై శ్రీదేవీ ఫోటోను మార్ఫింగ్ చేశాడు. ఎవరు.. ఏమిటి? అసలు సిసలైన వ్యక్తి ఎవరు? అసలు వ్యక్తి ఎవరు కాదో చెప్పుకోండి అనే విధంగా కామెంట్‌ను పెట్టారు.

డీ కంపెనీతో దావూద్ ఇబ్రహీంపై సినిమా
ఇక రాంగోపాల్ వర్మ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గోవాలో మకాం వేశారు. అంతర్జాతీయ నేరస్థుడు దావూద్ ఇబ్రహీంపై డీ కంపెనీ అనే సినిమాతోపాటు భారీ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. అలాగే ఆ చిత్రంలో అప్సర రాణి నటించిన ఓ పాటను కూడా విడుదల చేశాడు. త్వరలోనే ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











