RGV: పద్మ విభూషణ్ గ్రహితలపై వర్మ అనుచిత వ్యాఖ్యలు.. చిరంజీవి పేరు లాగుతూ..!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనం సృష్టించిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం వివాదాస్పద సినిమాలు తీస్తూ సెన్సేషన్ అవుతున్నాడు. ఇక ఆయన ఏ ట్వీట్ పెట్టిన ఈ మధ్య కాలంలో వైరల్ గా మారుతుంది. తాజాగా పద్మ విభూషణ్ గ్రహితలపై రామ్ గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి పేరును లాగుతూ ఓ ట్వీట్ పెట్టారు. దీనితో నెటిజన్స్ ఆర్జీవీపై ఫైర్ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....

శివ సినిమాతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాడు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత పలు చిత్రాలు తెరకెక్కించి.. బాలీవుడ్ కు వెళ్లాడు. ఇక అక్కడ కూడా సర్కార్ వంటి చిత్రాలు తీసి.. సెన్సేషన్ గా మారిపోయాడు. ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ఆర్జీవీ వివాదాస్పద సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. లక్మీస్ ఎన్టీఆర్, వంగవీటి, వ్యూహం వంటి పొలిటకల్ చిత్రాలతో మరోసారి ఆయన వార్తల్లో నిలుస్తున్నారు.

 Ram Gopal Varma Inappropriate comments on Padma Bhushan Chiranjeevi

ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్జీవీ... పలువురిపై సెటైర్స్ వేయడం కామన్. తాజాగా పద్మ విభూషన్ గ్రహితలపై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయం ఏంటంటే... గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో మెగాస్టార్ చిరంజీవికి భారత రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషన్ లభించింది.

ఇదే అంశంపై తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు.. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవికి విషెష్ చెబుతున్నారు. చాలామంది మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలో చిన్న నటుల నుంచి పెద్ద నటుల వరకు... అందరూ హర్షం వ్యక్తం చేశారు. మోహన్ బాబు సైతం ఆనందం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం చిరంజీవికి పద్మ విభూషణ్ పై ట్విట్టర్‌లో సెటైర్లు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ... ఓ నోట్ రాసుకువచ్చాడు. అందులో... 'తాను పద్మ సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాటక్ పేర్లు వినలేదని.. అదే వరుసలో మెగాస్టార్ ఉంటారంటూ రాసుకువచ్చారు.. తాను చిరంజీవికి అవార్డు రావడం పట్ల ఆశ్చర్యానికి గురి కాలేదని చెప్పుకువచ్చారు.

 Ram Gopal Varma Inappropriate comments on Padma Bhushan Chiranjeevi

ఒక వేళ చిరంజీవి గారు సంతోషంగా ఉంటే తాను సంతోషంగా ఉన్నట్లు నటిస్తానంటూ రాసుకువచ్చాడు. . ఇది చూసిన నెటిజన్లు ఆర్జీవీపై మండిపడుతున్నారు. నీ బాధేంటి.. ప్రశంసించడం నేర్చుకో, నీకు ఎందుకు ఎవరూ అవార్డ్ ఇవ్వడం లేదు మరి అంటూ కామెంట్స్ పెడుతూ ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X