నాకు తల్లే ఇష్టం.. పిల్ల కాదు.. అయినా ఆ ఉద్దేశం లేదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్
RGV comment on Janhvi: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి సినీ ప్రేమకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆర్జీవీ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. అది సెన్సేషనల్. మొత్తానికి ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఒకప్పుడు తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఎన్నో అద్బుతమైన సినిమాలు తీశాడు. కానీ, నేటీ ప్రేక్షకుల అభిరుచులకు తగిన విధంగా సినిమాలు తీయలేకపోతున్నారనే చెప్పాలి. ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెట్టి నెట్టింట్లో హల్చల్ చేస్తూనే ఉంటాడు. తాజాగా దివంగత నటి శ్రీదేవి గారాలపట్టి జాహ్నవి కపూర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఎంతకీ సెన్సేషనల్ డైరెక్టర్ కామెంట్స్ ఏంటో ఓ లుక్కెయ్యండి.
ఒకప్పుడు శివ లాంటి సూపర్ హిట్ మూవీస్ అందించాడు రామ్ గోపాల్ వర్మ.బాలీవుడ్ లోనూ బిగ్ బీ అలాంటి పెద్ద యాక్టర్ తో సంచలన సినిమాలు తీశాడు. ఎన్నో రికార్డు క్రియేట్ చేశారు ఆర్జీవీ. ఆ తరువాత కాలంలో ప్రేక్షకుల మనసు నచ్చేలా సినిమాలు తెరకెక్కించడంలో ఫెయిల్ అవుతున్నాడు. దీంతో వర్మ గ్రాఫ్ పడిపోయింది. ఇటీవల సీనియర్ హీరోలు, రాజకీయ నాయకుల బయోపిక్ లు తెరకెక్కిస్తూ వార్తలో నిలుస్తున్నారు. ఆ మూవీ సినిమాల్లో క్రేజ్ తగ్గినా.. పలు సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. రాంగోపాల్ వర్మ కు దివంగత నటి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆమెను ఓ నటిగా కాకుండా దేవతలా ఆరాధించాడు ఆర్జీవి. ఆమెతో కలిసి ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు. ఒకానొక సమయంలో ఆర్జీవి శ్రీదేవిని పెళ్లి కూడా చేసుకుందామని భావించాడట. కానీ ఆ అదృష్టం ఆర్జీవికి దక్కలేదు. కానీ శ్రీదేవిని మిస్ అయ్యానంటూ తరచూ తన అభిమానాన్ని చాటుకుంటాడు రామ్ గోపాల్ వర్మ.
శ్రీదేవి చనిపోయినప్పుడు ఎవరు ఎంత బాధపడ్డారో తెలియదు కానీ.. ఆర్జీవి మాత్రం చాలా బాధపడ్డారు ఆమె అంటే అంత ప్రేమ ఆయనకు. ఇప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా శ్రీదేవి గురించి చెప్పడానికి అస్సలుకు వెనకాడడు. శ్రీదేవి మీద ఇష్టం ఉన్న ఆమె కూతురు జాహ్నవి కపూర్ పై ఇష్టం లేదని ఆమెతో సినిమాలు తీయాలని ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

రాంగోపాల్ వర్మ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని శ్రీదేవి గురించి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా ఆర్జీవి మాట్లాడుతూ.. శ్రీదేవిని వేరే వారితో పోల్చడం తనకి ఇష్టం లేదని, ఆమెలా ఆమె కూతురు జాన్వి కపూర్ లేదని కామెంట్స్ చేశారు. శ్రీదేవిని చూస్తే అలానే ఉండి పోవాలని, ఒక పదహారేళ్ళ వయసు కావచ్చు ఒక వసంత కోరికల కావచ్చు ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలలో శ్రీదేవి నటించిన మెప్పించింది. ఆమె ను స్క్రీన్ పై చూసినప్పుడు తాను ఓ డైరెక్టర్ అనే విషయాన్ని మరిచిపోతానని చెప్పుకొచ్చాడు.
ఈ సమయంలో శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ తో ఏదైనా సినిమా తీస్తారా అని ప్రశ్నించగా.. రాంగోపాల్ వర్మ నో చెప్పారు. నాకు శ్రీదేవి అంటే ఇష్టం కూతురు జాన్వి కపూర్ అంటే కాదు. జాన్వి లో శ్రీదేవి అందం లేదు .. ఇంకా చెప్పాలంటే నేను ఎక్కువగా వారితో అంత కలెక్షన్ లేదు. ఏదేమైనా జాన్వికపూర్ తో సినిమా తీసే ఉద్దేశం లేదు. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











