Don't Miss!
- News
Lady: భర్త చనిపోయాడు, లేడీకి కోరికలు పుట్టించి అక్రమ సంబంధం, ఆఫీసులో లేడీ ఆత్మహత్య, లెటర్ !
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్‌ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
రణవీర్ సింగ్ ఫోటోషూట్ అందుకేనన్న వర్మ.. మరో వివాదాస్పద పోల్ కూడా!
ఒక మ్యాగజైన్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా ఫోటో షూట్ చేయించుకున్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటోలను ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో గత కొద్దిరోజుల నుంచి ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన షేర్ చేసిన ఫోటోలు మీద బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తుంటే సాధారణ జనం మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఆయన మీద ముంబైలో కొన్ని పోలీస్ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాంగోపాల్ వర్మ ఈ వ్యవహారం మీద హాట్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

ఆసక్తికరంగా
ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అంశాల మీద వివాదాస్పదంగా స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రణవీర్ సింగ్ హాట్ షో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీపిక పడుకునే భర్త బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ పేపర్ అనే ఒక మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలామంది హీరోలు హీరోయిన్లు ఆయన బోల్డ్ ఫోటోషూట్ చేసి ఫిదా అవుతూ కామెంట్లు పెడుతుంటే సాధారణ ప్రజానీకం మాత్రం కొంతమంది ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
|
న్యాయం చేయడం కోసం
అలాగే మరి కొంతమంది ఇలా బట్టలు విప్పతీసుకుని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంటూ ఘాటుగా స్పందిస్తున్నారు కొంతమంది అయితే తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ పోలీసులకు కూడా ఫిర్యాదులు చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ తరుణంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చాడు లింగ సమానత్వానికి న్యాయం చేయడం కోసం రణవీర్ సింగ్ ఇలా ఫోటోషూట్ చేసి ఉండొచ్చు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
|
ఎక్కువ ఆనందం
మహిళలు తమ శరీరాలలోని అంగంగాలు ప్రదర్శించంగా లేనిది పురుషులు ఎందుకు ప్రదర్శించకూడదు అంటూ రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. మహిళలతో సమానంగా మగవారికి కూడా హక్కులు ఉన్నాయని రాంగోపాల్ వర్మ ట్వీట్ లో గుర్తు చేశారు. అంతేకాక మగవాళ్ళు అమ్మాయిల నగ్న చిత్రాలను చూసి పొందే ఆనందంగా అంటే అబ్బాయిల నగ్న చిత్రాలను అమ్మాయిలు చూసి ఎక్కువ ఆనందం పొందుతారు అనేది నిజమా కాదా అంటూ ఒక పోల్ కూడా తన సోషల్ మీడియాలో పెట్టాడు.

రణవీర్ సింగ్ కి మద్దతుగా
ఇప్పటికే ఆ పోల్ కు దాదాపు 6000 ఓట్లు కూడా లభించాయి. ఇక రణవీర్ సింగ్ కి మద్దతుగా ఆలియా భట్ చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ'లో నటిస్తున్నాడు. ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న 'సర్కస్' షూటింగ్‌ను కూడా రణ్‌వీర్ పూర్తి చేశాడు.