Don't Miss!
- Sports
Brett Lee Advice: కోహ్లీకి ఇంతకంటే మంచి టైం దొరకదు.. కచ్చితంగా ఈ టైం ఉపయోగించుకోవాలి
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏపీలో టికెట్లు అమ్ముకోండి.. చూద్దాం కొడాలి నాని సవాల్.. రాంగోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్
సినిమా టికెట్ రేట్ల నిర్ణయించే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని సినీ ప్రముఖులు నాని, రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. సినీ ప్రముఖుల చేస్తున్న వ్యాఖ్యలపై, విమర్శలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టికెట్ల రేట్లపై నిర్ణయం తీసుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కొడాలి నాని వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ కూడా ఒకింత ఘాటుగానే స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

మేము జవాబుదారీ కాదు..
ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పగించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. పక్క రాష్ట్రంలో కూర్చొని.. పక్క రాష్ట్రంలో సినిమాలు తీస్తూ.. పక్క రాష్ట్రంలో జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు.
ఈ రాష్ట్రంలో మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించిన ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. కానీ పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తులకు మేము జవాబుదారీ కాదు అని మంత్రి కొడాలి నాని అన్నారు.

టికెట్లు అమ్ముకోండి చూద్దాం..
మా విధానాలు, నిర్ణయాలపై అవాకులు, చెవాకులు పేలే వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. టికెట్ల ధరలు నియంత్రించడంలో మాకేమి సంబంధం లేదని అంటున్న వాళ్లు టికెట్లు అమ్ముకోమని చెప్పండి. మాకు సంబంధం లేదని చెబితే వాళ్లనే టికెట్లు అమ్ముకోవచ్చు. దేనికి డిస్కషన్స్. ఊరికే మాటలు చెప్పడం తప్ప.. ఆర్చేవాళ్లు.. తీర్చేవాళ్లు లేరు అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలకు తక్కువ రేట్లకు వినోదం అందించాల్సిన అవసరం మా ప్రభుత్వానికి ఉంది. మా రాష్ట్రంలో టికెట్ల ధరలు ఎలా ఉండాలనే, ఎలా నిర్ణయించాలనే హక్కు, వాటిని నియంత్రించే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుంది. ఈ అంశంపై 13 మందితో కమిటి కూడా వేశాం. కమిటీతో మీటింగ్ జరిగింది అని మంత్రి కొడాలి నాని చెప్పారు.

కమిటీతో చర్చలు జరుపుతుంటే..
ఒకవైపు ప్రభుత్వంతో కమిటీ చర్చలు జరుపుతుంటే.. సంయమనం పాటించలేని కొందరు మా టికెట్ల రేట్లు మేమే నిర్ణయించుకొంటాం. మేమే అమ్ముకొంటాం అంటే.. వాళ్లనే అమ్ముకోండి అని కొడాలి నాని ఘాటుగా స్పందించారు. అయితే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

కొడాలి నాని ఎవరో నాకు తెలియదు.. వర్మ
ఇదిలా ఉండగా, కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిచండానికి నిరాకరించారు. A P టికెట్ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్‌కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ NameisNani ఒక్కడే.. వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు అని ఆర్జీవి సెటైర్ వేశారు.

తారాస్థాయికి చేరిన టికెట్ల రేట్ల వివాదం
ఇక పేర్ని నాని, రాంగోపాల్ వర్మ మధ్య గత రెండు రోజులుగా వాడివేడి చర్చ జరుగుతున్నది. టికెట్ల రేట్ల వ్యవహారంపై ఇద్దరు తమ అభిప్రాయాలను, వాదనలను, టెలివిజన్ ఛానెల్‌లోను, అలాగే సోషల్ మీడియా మాధ్యమంలోను హాట్ హాట్‌గా చర్చించుకొంటున్నారు. ఈ క్రమంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో అనే విషయంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.