twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Valentines Day వెధవలే ప్రేమలో పడుతారు.. అబ్బాయిలు అలా ప్రపోజ్ చేస్తే నమ్మకండి.. వర్మ ట్వీట్ల వర్షం

    |

    ప్రపంచ ప్రేమికుల దినోత్సవం వాలంటైన్ డే రోజున దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ల వర్షం కురిపించాడు. తాను ప్రేమికుల రోజుకు వ్యతిరేకం, ప్రేమలు, గిఫ్టులు అనేవి ఓ భ్రమ. వాటికి దూరంగా ఉండాలంటూ ఆర్జీవి ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. ప్రేమికుల రోజుకు దూరంగా ఉండాలని, అసలు ప్రేమించడం, ప్రేమలో పడటం తప్పు అంటూ వర్మ ఘాటైన పదజాలాన్ని ఉపయోగిస్తూ ట్వీట్లు చేశారు. వాలంటైన్ డే సందర్భంగా వర్మ ట్వీట్లు చేస్తూ..

    బ్రేకప్ చేసుకోవాలనుకొంటే..

    ప్రేమికుల రోజున నేను హ్యాపీ వాలంటైన్స్ డే అని చెప్పను. ఎందుకంటే ప్రేమికులను కలపడంలో వాలంటైన్ దారుణంగా విఫలమయ్యాడు. లెక్కలేని బ్రేకప్స్‌‌కు ఆయనే సాక్ష్యం. ఎవరైనా బ్రేకప్ చేసుకోవాలనుకొంటే.. ఈ రాత్రి వరకు వేచి చూడండి.. వాలంటైన్ గిఫ్టు వచ్చిన తర్వాత ఆ పని పూర్తి చేసుకోండి. ఖరీదైన వస్తువులు గిఫ్టులుగా ఇవ్వడం అనవసరం అంటూ వర్మ తన ట్వీట్‌లో తెలిపారు.

    లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మంచిదే.. కానీ

    ప్రేమలో పడటం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మంచిదే. కానీ తొలిచూపులో కాకుండా వీలైతే రెండో చూపు, లేదా మూడో చూపు కూడా చూడటం తెలివైన వాళ్లు చేసే పని అని వర్మ అన్నాడు. ఎప్పుడైతే ప్రేమలో పడుతారో.. మెదడు పనిచేయడం ఆగిపోతుంది. అందుకే ప్రేమికులందరూ వెధవలుగా మారిపోతారు. అందుకే నిన్ను నీవు ప్రేమించుకో.. అంతేగానీ.. రెండోవ్యక్తిని నమ్మడంలో ఎలాంటి అర్ధం ఉండదు అని వర్మ మరో ట్విట్‌లో తెలిపారు.

    ప్రేమ అనేది పెంపుడు కుక్కలోనే

    ప్రేమ అనేది పెంపుడు కుక్కలోనే

    నీ కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్లు దొరికే వరకు నీ ప్రియుడు నిన్ను తప్ప మరొకరిని ప్రేమించడు. రక్త ప్రసరణకే గుండె పనిచేస్తుంది. ప్రేమ అనే అనవసరమైన విషయాలను హృదయం పట్టించుకోదు. నిజమైన ప్రేమ కేవలం పిల్లలు, పెంపుడు కుక్కల్లోనే కనిపిస్తుంది. ఎలాంటి బాధ లేకుండా వారితోనే అది సాధ్యపడుతుంది. అందుకే నేను అన్ హ్యాపీ వాలంటైన్స్ డే అని అంటానని వర్మ ట్వీట్‌లో వెల్లడించారు.

    అబ్బాయిల ప్రపోజ్స్‌ను నమ్మొద్దు

    నా హృదయపూర్వకంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే.. ఏ అబ్బాయి అయినా ప్రపొజ్ చేస్తే అమ్మాయిలు నమ్మకూడదు. అలా అబ్బాయి చెబితే.. అతను అబద్ధం ఆడినట్టు గ్రహించాలి. ఆ మాట చెప్పింది అతడు కాదు.. అతడి అవయవం అనే విషయాన్ని గుర్తించాలి అంటూ వర్మ మరో సలహా ఇచ్చారు.

    వాలంటైన్స్ డేపై నమ్మకం ఉండదు..

    వాలంటైన్స్ డేపై నమ్మకం ఉండదు..

    జీవితంలో ఒకేసారి ప్రేమలోపడేది కేవలం వెధవలు మాత్రమే. తెలివైన వాళ్లు మాత్రం తమకు నచ్చిన ప్రతీ ఒక్కరిని గుర్తించి.. పలుమార్లు ప్రేమలో పడుతారు. అందుకే నాకు వాలంటైన్స్ డేపై నమ్మకం ఉండదు. కానీ కొండా ఫిల్మ్‌లో త్రిగుణ్, ఇరా మోర్ అనే లవర్లను దృష్టిలో పెట్టుకొని.. నా అన్ హ్యాపీ వాలంటైన్ డే అంటాను. వారి కోసం కొండా సినిమాకు సంబంధించిన పాటను ప్రేమికుల రోజున సాయంత్ర 5.30 గంటలకు రిలీజ్ చేస్తాను అని వర్మ ట్వీట్‌లో తెలిపారు.

    English summary
    Director Ram Gopal Varma interesting tweets on love at Valentines Day. He tweete that, Unlike the dumbos who fall in love with only one , a wise one will fall in love with many before deciding on which one is the best.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X