శ్మసానంలో రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తున్నాడు?

By Srikanya

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం 'ఆవాహం' ప్రమేషన్ కోసం హైదరాబాద్ వచ్చి టీవీ ఛానెల్స్ కు కంటెన్యూగా ఇచ్చిపారేశారు. అందులో భాగంగా ఆయన సాక్షి ఛానెల్ ని కలిసారు. అయితే వెన్యూ మాత్రం ఓ శ్మసానంలో ఫిక్స్ చేసుకున్నారు. ఆ పోగ్రాం పేరు శ్మసానంలో రామ్ గోపాల్ వర్మ అని పేరు పెట్టారు. ఇక ఇంటర్వూలో ఆయన తనకు దెయ్యాలు ఎప్పుడూ కనపడలేదు కాబట్టి అవటం నమ్మకం లేదన్నాడు. అలాగే దేముడు లేడని బ్రతుకుతున్న తనకు ఏనాడైనా దేముడు కనపడితే భయమేస్తుందన్నాడు. అలాగే ఆవాహం సబ్జెక్టు గురించి చెపుతూ తనతో ఓ సారి సంజయ్ దత్ తన తల్లి నర్గీస్ చనిపోయాక ఓ రోజు కిటికీలోంచి చూస్తున్నట్లు కనపడిందని చెప్పారు. ఎంత తల్లి అయినా చనిపోయిన ఆమె కనపడటం భయం కలిగించే అంశమని అదే ఆవాహం లో చెప్పుకొచ్చానని అన్నారు. అలాగే తమ సినిమా చూసి భయపడి గుండె వేగం పెరగకుండా కంట్రోలు చేసుకున్న వారికి బహుమతినిస్తామన్నామని చెప్పారు.

గతంలో ఆయన తీసిన ఫూంక్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రియల్ తొమ్మిదవ తేదీన రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మిలింద్‌ గడాక్కర్‌ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ ఈ చిత్రం రూపొందింది అన్నారు. ఇక ఈ చిత్ర కథ ఈ విధంగా సాగుతుంది. 'రక్ష' చిత్రంలో చేతబడిలాంటి క్షుద్రశక్తులు తెలిసిన ఒక మంత్రగత్తె తన స్వప్రయోజనాల కోసం ఓ చిన్నపిల్లని హింసిస్తూ చంపే ప్రయత్నంలో ఆ అమ్మాయి తండ్రిని అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. తన పాపను రక్షించుకునే ప్రయత్నంలో ఆ తండ్రి ఒక మంత్రగాణ్ణి కలిసి అతని సహాయంతో ఆమెను చంపుతాడు. 'ఆవహం' చిత్రకథ, ఆ చనిపోయిన మంత్రగత్తె ప్రేతాత్మ రూపంలో తిరిగొచ్చి, తన మరణానికి కారణమైన మంత్రగాణ్ణి చంపడంతో మొదలవుతుంది. 'రక్ష'లో రాజీవ్‌ కుటుంబం అనుభవించిన పరిస్థితుల కంటే కూడా అత్యంత దుర్భరమైన పరిస్థితులు 'ఆవహం'లో ఉంటాయి. ఎప్పుడైతే ఆ ప్రేతాత్మ మంత్రగాణ్ణి బలి తీసుకున్నప్పుడు, ఆ కుటుంబం పరిస్థితేంటి?అనేదే ఈ చిత్రం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X