twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంగోపాల్ వర్మను డిస్ట్రబ్ చేస్తున్న హాట్ బ్యూటీ.. బోల్డ్‌గా నటిస్తున్న ఈమె ఎవరంటే!

    By Rajababu
    |

    Recommended Video

    Ram Gopal Varma's Bhairava Geetha Heroine Irra Photo Became Viral

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో బాగా పొగిడేస్తున్న చిత్రం భైరవగీత. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రానికి సిద్ధార్థ అనే నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం గురించి, నటిస్తున్న హీరోయిన్‌ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రశంసలు కురిపించడంతో భైరవ గీత చిత్రంపై ఆసక్తి పెరిగేలా చేసింది. వివరాల్లోకి వెళితే..

    స్వీయ నిర్మాణంలో భైరవ గీత

    భైరవ గీత సినిమాను భాస్కర్ అనే ఔత్సాహిక నిర్మాతతో కలిసి రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్నాడు. భూస్వాములకు, పేదవర్గాలకు జరిగే పోరాటంలో ఓ వ్యక్తి ఎలా ముందుకు తీసుకెళ్లాడనేది చిత్ర కథ. వర్మ మార్కు చిత్రంగా హింసాత్మకంగా సాగుతుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    బోల్డ్‌గా ఇరా

    బోల్డ్‌గా ఇరా

    భైరవ గీత చిత్రంలో నటిస్తున్న ఇరా అనే కొత్త హీరోయిన్ చాలా బోల్డ్‌గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ చిత్రం కోసం నిర్వహించిన యాక్టింగ్ వర్క్‌షాప్‌లో ఇరా తన ప్రతిభతో రాంగోపాల్ వర్మను పట్టేసింది. దాంతో ఇరా వెండి తెర స్వప్నం సాకారమైంది. ఈ చిత్రంలో ధనుంజయ హీరోగా నటిస్తున్నాడు.

    ఫ్యాక్షన్ నేపథ్యంగా లవ్‌స్టోరీ

    హింసాత్మక పోరాటం నేపథ్యంగా భైరవ గీత చిత్రం ఓ అందమైన లవ్ స్టోరిగా తెరకెక్కుతున్నది. షూటింగ్ దశలోనే ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

     నా పాత్ర గురించి ఇప్పుడే

    నా పాత్ర గురించి ఇప్పుడే

    భైరవ గీత చిత్రంలో అవకాశం దక్కడంపై ఇరా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది. ఈ చిత్రంలోని తన పాత్ర గురించి ఇరా చెబుతూ నేను గ్రామపెద్ద కూతురిగా నటిస్తున్నాను. నా పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడే ఆ పాత్ర గురించి చెప్పడం సమంజసం కాదు. షూటింగ్ పూర్తయిన తర్వాత అన్ని వివరంగా చెబుతాను అని వెల్లడించింది.

    English summary
    Bhairava Geetha featuring Daali aka Dhananjay in the lead, has a new heroine Irra on board. The bilingual--in Kannada and Telugu- is directed by newcomer Siddhartha. The film is produced by Ram Gopal Varma in association with Bhaskar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X