Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాంగోపాల్ వర్మను డిస్ట్రబ్ చేస్తున్న హాట్ బ్యూటీ.. బోల్డ్‌గా నటిస్తున్న ఈమె ఎవరంటే!
Recommended Video
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో బాగా పొగిడేస్తున్న చిత్రం భైరవగీత. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రానికి సిద్ధార్థ అనే నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం గురించి, నటిస్తున్న హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రశంసలు కురిపించడంతో భైరవ గీత చిత్రంపై ఆసక్తి పెరిగేలా చేసింది. వివరాల్లోకి వెళితే..
|
స్వీయ నిర్మాణంలో భైరవ గీత
భైరవ గీత సినిమాను భాస్కర్ అనే ఔత్సాహిక నిర్మాతతో కలిసి రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్నాడు. భూస్వాములకు, పేదవర్గాలకు జరిగే పోరాటంలో ఓ వ్యక్తి ఎలా ముందుకు తీసుకెళ్లాడనేది చిత్ర కథ. వర్మ మార్కు చిత్రంగా హింసాత్మకంగా సాగుతుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
బోల్డ్‌గా ఇరా
భైరవ గీత చిత్రంలో నటిస్తున్న ఇరా అనే కొత్త హీరోయిన్ చాలా బోల్డ్‌గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ చిత్రం కోసం నిర్వహించిన యాక్టింగ్ వర్క్‌షాప్‌లో ఇరా తన ప్రతిభతో రాంగోపాల్ వర్మను పట్టేసింది. దాంతో ఇరా వెండి తెర స్వప్నం సాకారమైంది. ఈ చిత్రంలో ధనుంజయ హీరోగా నటిస్తున్నాడు.
|
ఫ్యాక్షన్ నేపథ్యంగా లవ్‌స్టోరీ
హింసాత్మక పోరాటం నేపథ్యంగా భైరవ గీత చిత్రం ఓ అందమైన లవ్ స్టోరిగా తెరకెక్కుతున్నది. షూటింగ్ దశలోనే ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
నా పాత్ర గురించి ఇప్పుడే
భైరవ గీత చిత్రంలో అవకాశం దక్కడంపై ఇరా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది. ఈ చిత్రంలోని తన పాత్ర గురించి ఇరా చెబుతూ నేను గ్రామపెద్ద కూతురిగా నటిస్తున్నాను. నా పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడే ఆ పాత్ర గురించి చెప్పడం సమంజసం కాదు. షూటింగ్ పూర్తయిన తర్వాత అన్ని వివరంగా చెబుతాను అని వెల్లడించింది.