twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ, రవితేజ కాంబినేషన్ 'దొంగల ముఠా' పూర్తి డిటేల్స్

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ, రవితేజ కాంబినేషన్ లో దొంగలముఠా అనే చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లో ఫినిష్ చేస్తానంటన్నారాయన. ఈ చిత్రం గురించి చెబుతూ వర్మ...కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం-అప్పలరాజు సినిమా పిబ్రవరి 4న విడుదలైన వెంటనే వారం లోపల పిబ్రవరి 11న నేను రవితేజతో సినిమా ప్రారంభించబోతున్నాను. ఈ సినిమా టైటిల్ దొంగల ముఠా. ఈ సినిమా అత్యంత ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఓ ఉత్కంఠభరితమైన ధ్రిల్లర్. ఇందులో ఛార్మి, అజయ్, సుబ్బరాజు కొన్ని ముఖ్యమైన పాత్రలు ఫోషిస్తున్నారు. మిగలిన పాత్రధారుల ఎంపిక ఇంకా జరుగుతోంది.

    ఒక సినిమా పూర్తి చేయటానికి సాధారణంగా వంద నుండి నూటయాభై డేస్, నూట యాభై నుండి రెండు వందల మంది కన్నా ఎక్కవ మంది పనిచేస్తారు. కానీ ఇక్కడ అత్యంత విభిన్నమైన విషయం ఏమిటంటే రవితేజతో నేను రెండు గంటల నిడివి ఉండే ఈ దొంగలముఠా సినిమా మొత్తాన్ని నేను కేవలం ఐదు రోజుల్లో పూర్తి చేయబోతున్నాను. అది కూడా కేవలం ఎనిమిది మంది యూనిట్ మెంబర్స్ తో.

    ఇదే కాకుండా ఈ సినిమాలో అర్టిస్టులకి కానీ, టెక్నికల్ క్రూ మెంబర్స్ కి కానీ,ఎక్విప్ మెంట్ వగైరా సప్లయిర్స్ కి కానీ ఎవరికీ రెమ్యునేషన్ ఇవ్వటం లేదు. ఈ సినిమా సబ్జెక్టు, దాని వెనకాల ఉన్న ఉద్దేశ్యాన్ని అర్దం చేసుకుని ఎలాగైనా ఈ చిత్రంలో పాలు పంచుకోవాలనే ఉత్తేజితులైన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తో మాత్రమే ఈ సినిమా నిర్మింపబడుతోంది. సినిమా రిలీజైన తర్వాత దాన్నించి లాభాలు వస్తేనే వాళ్ళ వేల్యూని బట్టి వాళ్ళ వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వబడతాయి.

    పిబ్రవరి 11కి షూటింగ్ మెదలుపెట్టి మార్చి 11కి ఈ సినిమా విడుదల చేయబోతున్నాను. అంటే సరిగ్గా షూటింగ్ ప్రారంభించిన నెల రోజులకి. అలాగే ఈ సినిమాను ఒక ప్రత్యేకమైన మేకింగ్ టెక్నాలిజీతో చేయటం వల్లే రెండు గంటల సినిమాని కేవలం ఐదు రోజుల్లో పూర్తి చేసి, అంత వేగంగా రిలీజ్ చేయటం సాధ్యపడుతుంది. ఇలా ఈ టెక్నాలిజితో చేయటం వెనక నా ముఖ్య ఉద్దేశ్యం డిజిటల్ యుగంలో మనకి అందుబాటులో ఉన్న టెక్నాలిజీని సరైన పద్దతిలో ఉపయోగిస్తే ఏమేమి సాధఇంచవచోచ అనేది అందరికీ తెలియచేయటం అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X