twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పట్లో కెఏ పాల్ ఇప్పుడు నువ్వా..? రామ్‌గోపాల్‌ వర్మపై పేలుతున్న సెటైర్స్..

    |

    డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ వింతచేష్టలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ వివాదాస్పద వీరుడు హీరోయిన్‌తో చేసిన పనులు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఈ ఇష్యూపై రామ్‌గోపాల్‌ వర్మను ఏకిపారేస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దామా..

     రామ్‌గోపాల్‌ వర్మ వింత చేష్టలు

    రామ్‌గోపాల్‌ వర్మ వింత చేష్టలు

    తన నిర్మాణంలో రూపొందిన ‘బ్యూటీఫుల్‌' సినిమా ప్రమోషన్స్ లో రెచ్చిపోయాడు రామ్‌గోపాల్‌ వర్మ. ఈ సినిమా హీరోయిన్‌ నైనా గంగూలీతో కలిసి వర్మ డాన్స్ చేయడమే గాక ఆమె కాళ్లపై పడి వింత వింత చేష్టలు చేశాడు. దానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

     వర్మలో ఏంటీ ప్రవర్తన?

    వర్మలో ఏంటీ ప్రవర్తన?

    సినిమా ప్రమోషన్స్ కోసం వర్మ పడే పాట్లు చూసి బాబోయ్! అంటూ ముక్కున వేలేసుకున్న జనం.. ఆయన వింత చేష్టలు చూసి ఒకింత చిరాకు పడుతున్నారు. హీరోయిన్ తో డాన్స్ చేయడం వరకు ఓకే గానీ ఆమె కాళ్లపై పడి ఇలా వింతగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

     నైనా షాక్‌.. ఇలా బెహేవ్ చేయడం వెనుక ఏముంది

    నైనా షాక్‌.. ఇలా బెహేవ్ చేయడం వెనుక ఏముంది

    వర్మ చేసిన పనికి హీరోయిన్ నైనా కూడా షాక్‌కు గురైంది. అంతే కాదు వర్మ ఎందుకలా చేశారో అర్థంకాక చిత్రయూనిట్ సైతం కంగారు పడింది. నిజానికి నైనా గంగూలీ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోయిన్. వర్మనెమో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన బడా డైరెక్టర్. అలాంటిది ఆమెతో ఇలా బెహేవ్ చేయడం వెనుక అర్థమేంటని తెలియక తలపట్టుకుంటున్నారు జనం.

    సెటైర్ల మీద సెటైర్లు

    సెటైర్ల మీద సెటైర్లు

    ఈ ఇష్యూపై నెట్టింట జనం గగ్గోలు పెడుతూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో వర్మ ఏం చేసినా కరెక్టే అని నమ్మే హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం, నైనా గంగూలీ లాంటి కొత్త హీరోయిన్ కాళ్ల మీద పడటాన్ని విమర్శిస్తున్నారు. వర్మ.. మాకు ఏంటీ ఖర్మ అంటూ ఆయనపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.

    కేఏ పాల్ కూడా ఇలాగే కారులో..

    కేఏ పాల్ కూడా ఇలాగే కారులో..

    గతంలో కేఏ పాల్ కూడా ఇలాగే కారులో కూర్చొని బాక్సింగ్ చేస్తున్నట్లు చేసిన వింత ప్రవర్తన చూసి షాకైన జనం, ఇప్పుడు వర్మ తీరు చూసి కూడా దానికి రెట్టింపు షాక్ అయ్యారు. ఇంటర్వ్యూల్లో పలు రకాల ముచ్చట్లు చెప్పే వీళ్ళే ఇలా బెహేవ్ చేయడమేంటని నెటిజన్స్ అడుగుతున్నారు. చూడాలి మరి దీనిపై వర్మ స్పందిస్తారా ?లేదా అనేది.

    English summary
    Ram Gopal Varma's latest movie Beautiful. In this movie promotion Rgv enjoyed with heroine Naina Ganguly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X