twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ తొందరపడి ట్వీట్...అంతటా ఆగ్రహం

    By Srikanya
    |

    హైదరాబాద్: సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో నిత్యం ఉండే రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లతో పోస్ట్ లతో వివాదాలు క్రియేట్ చేస్తూండటం మామూలే. అయితే ప్రస్తుతం వర్మ తాను తొందరపడి చేసిన ఓ ట్వీట్ కు నాలుక కరుచుకోవాల్సి వచ్చింది. విషయం కన్ఫర్మ్ చేసుకోకుండా ట్వీట్ చేయటంతో విమర్శలు పాలయ్యారు. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ మరేదో కాదు... ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే... చనిపోయినట్లు ...అందుకు ఆయనకు సంతాపం తెలుపుతూ ట్విట్ చేశారు.

    అయితే జరిగిన పొరపాటును గ్రహించిన వర్మ ...కొద్దిసేపట్లోనే తాను చేసిన ట్విట్ ను తొలగించేశారు రాంగోపాల్ వర్మ. అయితే బతికున్నవాళ్లు చనిపోయారని అవగాహనారాహిత్యంతో స్పందించడంపై నెటిజన్లు,బాలచందర్ అభిమానులు మండిపడుతున్నారు. గత కొద్ది రోజులుగా బాలచందర్ ఆరోగ్య పరిస్ధితేం బాగోలేదు. మీడియా మొత్తం ఈ విషయమై కేంద్రీకరించి ఉంది. హాస్పటిల్ వైద్యులు బులెటెన్స్ విడుదల చేస్తున్నారు.

    Ram Gopal Varma 'kills' Balachander on twitter

    ఇక ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ నగరంలోని కావేరి ఆస్పత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సమస్య మినహా మిగతా అన్ని అవయవాలు కుదుటపడినట్లు వైద్యులు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులెటన్‌లో వెల్లడించారు. కిడ్నీలకు డయాలసిస్ చికిత్స అంది స్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలచందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

    పలువురు సినీ ప్రముఖులు బాలచందర్‌ను ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. డీఎంకే నేత స్టాలిన్, విజయకుమార్, నటి కె ఆర్ విజ య, రాజేష్, తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ మొదలగు పలువురు కె.బాలచందర్‌ను పరామర్శించారు. కె ఆర్ విజయ బాలచందర్‌ను చూసి బోరున విలపించారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి చేరాలని ఆమె ఆకాంక్షించారు.

    English summary
    Ram Gopal Varma committed the biggest blunder Today by tweeting about the demise of a Legendary Personality.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X