Konda: తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వర్మ మొదటి సినిమా.. భయంకరమైన నిజం అంటూ..

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి అసలైన రియాలిటీ కథలు వచ్చి చాలా కాలమైంది. చివరగా వంగవీటి తర్వాత వర్మ మళ్లీ ఆ స్థాయిలో అయితే గుర్తింపు పొందలేదు. ఎక్కువగా ఓటీటీ సినిమాలపై ఆయన ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత వర్మన కొండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలంగాణలో కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ నేతలు కొండా మురళి కొండా సురేఖ పాత్రల ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్లు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ఇక ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో విడుదల చేయడంతో ప్రస్తుతం నెటిజన్ల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.

కొండ మురళి.. కొండా సురేఖ పాత్రలతో..

కొండ అనేది 1980-90ల కాలంలో జరిగిన నిజ జీవితంలోని కోన్ని అంశాలను హైలెట్ గా చేసుకొని తెరకెక్కించినట్లు చెబుతూ.. కొండ మురళి మరియు కొండా సురేఖ పాత్రల బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుందని చెప్పారు. కొండమురళి పాత్రలో అదిథ్ నటించగా కొండా సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటిస్తోంది. సినిమాలో రియాలిటీ లుక్స్ కోసం వీరు చాలానే మారినట్లు తెలుస్తోంది. సరికొత్తగా కనిపిస్తున్నారు.

నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో..

నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో..

సాధారణంగా రామ్ గోపాల్ వర్మ నిజ జీవితంలోని సంఘటనలను తెరకెక్కిస్తే ఆ సినిమాలు చాలా వరకు ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంటాయి. ఇక ఇప్పటివరకు వర్మ తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథతో అయితే సినిమా చేయలేదు. మొదటిసారి కొండ సురేఖ , కొండ మురళి నిజజీవితంలోని అంశాలను హైలెట్ చేయబోతున్నారు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక రాడికల్ పొలిటికల్ మూవీ అంటూ వర్మ ఎప్పటిలానే ప్రమోషన్స్ డోస్ కూడా పెంచాడు.

కొండ సురేఖగా ఇర్రా మోర్

భయంకరమైన నక్సల్ నేపథ్యానికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రేమ కథ కూడా ఇందులో హైలెట్ గా ఉండబోతోందని వివరణ ఇచ్చారు. ఇర్రా మోర్ స్పందిస్తూ.. మరోసారి రామ్ గోపాల్ వర్మ గారితో వర్క్ చేసుకుండడం చాలా ఉత్సాహంగా ఉంది. ప్రేమ అలాగే భయంకరంగా మునిగిపోయిన కొండా జీ కథను విప్పుదాం అంటూ కొండా మురళి విభిన్న జీవిత దశల్లో కొండా సురేఖగా ఒక మంచి భాగం అని వివరణ ఇచ్చారు.

Recommended Video

#BiggBossTelugu ఇతను Eliminate అవడం పక్కా.. టాప్ 5 వీరే!! || Filmibeat Telugu
క్రూరమైన అణచివేత..

క్రూరమైన అణచివేత..

ఇక వర్మ మరొక క్లారిటీ ఇచ్చారు. కొండా సినిమా అనేది తెలంగాణ యాసలో పూర్తిగా చిత్రీకరించబడిన నా మొట్టమొదటి చిత్రం అని.. యాదృచ్ఛికంగా యాదగిరి పాత్రలో తెలంగాణ యాసను ఉపయోగించిన మొదటి చిత్రం శివ అని కూడా తెలియజేశారు. ఇక కొండా చిత్రం 80 మరియు 90 లలో భూస్వాముల క్రూరమైన అణచివేతను చూపిస్తుందని అదే మెయిన్ లైన్ అంటూ అదిథ్ ను ట్యాగ్ చేశారు.

సోషల్ మీడియాలో ఈ సినిమాపై వారుసగా పోస్టులు పెడుతున్న వర్మ త్వరలోనే రెగ్యులర్ గా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను విడుదల తేదీలపై కూడా మరో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X