ఎన్టీఆర్: కథానాయకుడు అందుకే ప్లాప్.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీ క్లైమాక్స్ కేక.. వర్మ

Recommended Video

Lakshmi's NTR : RGV Talks About Ntr Biopic | Filmibeat Telugu

సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ సరికొత్త వివాదం లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో హడావిడి సృష్టిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి జీవితంలో చోటుచేసుకొన్న సంఘటన ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వర్మ వెల్లడించిన విషయాలు ఇవే..

లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీ క్లైమాక్స్ కేక

లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీ క్లైమాక్స్ కేక

లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీ క్లైమాక్స్ కేక పెట్టించేలా ఉంటుంది. ఎన్టీఆర్ జీవితంలోని అత్యంత వివాదాస్పద ఘటన సినిమా చివర్లో ఆసక్తిని రేపుతుంది. ఆలోచింపజేసేలా ఉంటుంది. వైశ్రాయ్ ఎపిసోడ్‌ ద్వారా వాస్తవాలు వెల్లడిస్తాను అని వర్మ పేర్కొన్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ అందుకే ఫ్లాప్

ఎన్టీఆర్ బయోపిక్ అందుకే ఫ్లాప్

బాలకృష్ణ రూపొందించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఫ్లాప్ గురించి వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. బయోపిక్ అంటే ఓ క్లిష్టమైన సమస్య ఉండాలి. సినిమా కథలో ఓ బలమైన విలన్ ఉండాలి. అవేమీ ఎన్టీఆర్ కథానాయకుడులో కనిపించలేవు. అందుకే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అనే అభిప్రాయాన్ని వర్మ వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ జీవితం బోరింగ్‌గా

ఎన్టీఆర్ జీవితం బోరింగ్‌గా

ఎన్టీఆర్ జీవితం అంతా బోరింగ్ ఉంటుంది. ఆయన చివరి రోజులే చాలా ఎక్సైటింగ్ ఉంటాయి. ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో అనే ట్విస్టులు, ఊహించని సంఘటనలు కనిపిస్తాయి. చివరి రోజుల్లో చోటుచేసుకొన్న విషాదాలే ఆయన మరణానికి దారి తీశాయి అని వర్మ పేర్కొన్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో వాస్తవాలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో వాస్తవాలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో అనేక వాస్తవాలను తెరకెక్కించాం. ఎన్టీఆర్‌ను లక్ష్మీ పార్వతి వివాహం చేసుకొన్న తర్వాత చోటుచేసుకొన్న సంఘటనలకు వాస్తవ రూపం కల్పించాం. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించినప్పటి నుంచి ఆయన మరణం వరకు జరిగిన కీలక సంఘటనలు పేర్కొన్నాం అని వర్మ ఇటీవల ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X