twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీడియా భ్రష్టు పట్టింది: వర్మ

    By Staff
    |

    నితిన్ హీరోగా వస్తున్న అడవి చిత్రం ప్రమేషన్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ నగరానికి వచ్చారు. ఆ సందర్భంగా కలిసిన మీడియాతో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. అందులో ముఖ్యంగా ఆయన తీస్తున్న రణ్ చిత్రం..మీడియాపై అస్త్రం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు.

    ఎలక్ట్రానిక్‌ మీడియా తమ రేటింగ్‌ పెంచుకోవడం కోసం రకరకాలుగా మనుషుల మనసులపై ఆడుకుంటోంది. ముఖ్యంగా రాజకీయ మీడియా సమాజాన్ని చెడగొడుతోంది. ప్రజల్ని పక్కదోవ పట్టిస్తోంది. జరిగిన సంఘటనను జరిగినట్లుగా చూపాలి. దానికి లేనిపోని ఉపమానాలు, ఫ్లాష్‌‌బ్యా‌క్‌లు చూపించేసి మర్చిపోయిన దాన్ని మరలా గుర్తుకు తెచ్చి తప్పుడు వార్తలు చూపిస్తున్నారు. అందుకే రాజకీయ మీడియా చీకటి కోణాల్ని వెలికి తెస్తున్నా.

    అలాగని రాజకీయనాయకులపై సెటైరా అని అడిగిన దానికి అటువంటిదేమీలేదు..డైరెక్ట్‌ గానే అటాక్‌ చేస్తున్నాను. సంఘటన జరిగినప్పుడు సంఘటనగా చూపండి. 'విరామం తీసుకుంటున్నాం. ఎక్కడికీ వెళ్ళొద్దు..'అంటూ ఛానళ్లల్లో చెప్పి క్రింద మరో వార్త స్క్రోలింగ్ వేసి ఆసక్తికరంగా చెప్పడం తప్పంటాను. దీనికంటే పెద్ద తప్పు ఇంకోటి ఉంది. ఏదైనా సంఘటనలో ఎవరైనా చనిపోతే పదేపదే శవాల్ని చూపించి మనసుషుల మనసుల్ని కలచివేస్తున్నారు. అదే విదేశాల్లో అయితే న్యూస్ ప్రెజెంటేషన్ వేరుగా ఉంటుంది.

    ఉదాహరణకి అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిన సంఘటనను తీసుకుంటే...అన్ని అంతస్థుల భవనం కూలిపోతే ఎంతోమంది చనిపోయారు. కానీ అంతర్జాతీయ ఛానళ్ళు ఎక్కడా శవాలను చూపించలేదు. అదే మనవాళ్లు...ముఖ్యంగా తెలుగు ఛానల్స్‌...పదేపదే శవాల్ని చూపించాయి. దీన్ని చూస్తే మనుషుల్తో వ్యాపారం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఒళ్ళు గగుర్పాటు కలిగే విజువల్స్‌ రౌండ్‌ ది క్లాక్‌గా చూపిస్తారు.

    ఇక బిబిసి, ఐఎన్‌ఎన్‌ ఏదైనా తీసుకుంటే విదేశాల్లో వార్తను వార్తగా చెబుతారు. సంఘటనను సంఘటగా చూపిస్తారు. దానికి లేనిపోనివి జోడించి రేటింగ్‌ పెంచుకోవడం.. ఉండదు. దీనికి ప్రధానకారణం మన రాజకీయ వ్యవస్థ సరిగ్గాలేక పోవడమే. ప్రతి ఛానల్‌కు ఏదో రాజకీయ నేపథ్యం ఉంటూనే ఉంది. దీనివల్ల మీడియా భ్రష్టు పట్టింది. పైగా..ఒక్కో ఛానల్‌ పోటీలు పడి మర్డర్లు ఎలాచేయాలి? అనేవి ఆసక్తికరంగా చూపుతున్నాయి. మన అభివృద్ధి ఎటువైపు పోతుందో అర్థంకావడం లేదు. ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? వీటిపై నియంత్రణ లేదా? అని ప్రశ్నిస్తున్నా అంటూ తన మనస్సులోని భావాలను వ్యక్తం చేసారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X