చంద్రబాబు, జగన్, పవన్ ఫినిష్.. ఇప్పుడు ఏకంగా! వర్మ సరికొత్త సంచలనం

సంచలనానికి మారు పేరైన రామ్ గోపాల్ వర్మ సరికొత్త సంచలనానికి తెరలేపాడు. వివాదాస్పద మాటలు, వైవిద్యభరితమైన సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట అయిన ఈ డైరెక్టర్.. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులకు చుక్కలు చూపిస్తున్నాడు. తనదైన పంథాలో వెళ్తూ వివాదాస్పదం కాదంటూనే వివాదాలకు బీజం వేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యాడు వర్మ.

రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టేలా వరుస అప్‌డేట్స్

రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టేలా వరుస అప్‌డేట్స్

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు వర్మ. అచ్చం రాజకీయ నాయకులను పోలి ఉన్న నటులతో వివాదాస్పద సన్నివేశాలు చిత్రీకరించి రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్ అన్నీ దేనికవి ప్రత్యేకమైనవే.

చంద్రబాబు, జగన్, పవన్ ఫినిష్..

చంద్రబాబు, జగన్, పవన్ ఫినిష్..

ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలోని చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, కెఏ పాల్, నారా లోకేష్ లాంటి కొన్ని క్యారెక్టర్స్ రివీల్ చేసి సంచలనం సృష్టించిన వర్మ.. ఈ సారి సరికొత్తగా ట్రై చేస్తూ వార్తల్లో నిలిచాడు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో కొత్త నటుడు' అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టేశాడు.

ఇంతకీ ఎవరతను? అసలు సంగతేంటి..?

ఇంతకీ ఎవరతను? అసలు సంగతేంటి..?

ఆ కొత్త నటుడు మరెవరో కాదు.. రామ్ గోపాల్ వర్మనే. ఇదే ఇక్కడ అసలు ట్విస్ట్. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో తనది కూడా ముఖ్యపాత్ర ఉంటుందని పేర్కొన్నాడు వర్మ. దీంతో ఇన్ని రోజులు వచ్చిన అప్‌డేట్స్ ఒకెత్తు.. ఈ అప్‌డేట్ ఒకెత్తు అయింది. తెరవెనుక ఉంటేనే రెచ్చిపోయే వర్మ స్వయంగా కెమెరా ముందుకొస్తున్నాడంటే ఇక ఆ సునామీ ఊహాతీతం అంటున్నారు ఇది చూసిన జనం.

రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్

రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో తొలిసారి వెండితెరపై కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ ఏంటనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. దర్శకుడిగా విలక్షణత చాటిన వర్మ.. యాక్టర్ కాబోతున్నాడని తెలిసి ఆయన పాత్ర చూడాలని జనంలో ఆత్రుత నెలకొంది. చూడాలి మరి యాక్టర్‌గా వర్మ సంచలనాలు ఎలా ఉంటాయో.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు జోష్ ఎలా ఉందంటే

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు జోష్ ఎలా ఉందంటే

ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై హైప్ నెలకొంది. నవంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది. పైగా ఈ సినిమాపై పోలీస్ కేసు కూడా నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X