ఆమె తొడలు నచ్చాయంటూ వర్మ
ప్రముఖ రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడినా సంచలనమే..ఏం కామెంట్ చేసినా అది ఎవరో ఒకరికి గుచ్చుకుంటుంది.తాజాగా ఆయన్ని మహేష్ భట్ చిత్రం మర్డర్ 2 చూసారా అని అడిగారు.దానికి ఆయన చూసానని అందులో నటించిన హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండెజ్ తొడలు చాలా బాగున్నాయని కామెంట్ చేసారు.అంటే ఆ సినిమాలో హర్రర్ ఎలిమెంట్ కన్నా సెక్స్ కంటెంట్ ఎక్కువ ఉందని ఇండైరక్ట్ గా చెప్పారన్నమాట. అయితే ఈ విషయమై వర్మ నోరు పెట్టటం ఎందుకనుకున్నారో ఏమో కానీ భట్ క్యాంప్ ఏమీ కామెంట్ చేయలేదు.
ఇక వర్మ తన తాజా చిత్రం ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ గురించి చెబుతూ..ఆ చిత్రం మర్డర్ ప్లాట్ చుట్టూ తిరిగినా అందులో ప్రేమ ఉందని,అయితే అది ప్రేమ కథ కాదని,ఆ ప్రేమ ఎమోషన్ చివరకు మర్డర్ తో ముగుస్తుందని చెప్పుకొచ్చారు.ఇక 'మర్డర్ 2'ఇమ్రాన్ హష్మి, జాక్వలైన్ ఫెర్నాండెజ్ కాంబినేషన్ లో రూపొంది విడుదలైంది. మల్లికా షెరావత్ హీరోయిన్ గా 2004లో వచ్చిన 'మర్డర్' చిత్రానకి ఇది సీక్వెల్. ముఖేష్ భట్ నిర్మించిన ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు.ప్రశాంత్ నారాయణ్, సులఘ్న పాణిగ్రాహి, సుధాంశు పాండే ముఖ్య పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











