వ్యవస్థ ధ్వంసం.. చెత్త బుట్టలో విసిరికొట్టావు.. రాంగోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్
యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్రను తిరగరాస్తున్నది. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ ఈ సినిమాపై, దర్శకుడు సందీప్ రెడ్డి వంగపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా యానిమల్ సినిమాపై ఆర్జీవి ఓ రివ్యూ కూడా రాశారు. వర్మ రాసిన సమీక్షపై సందీప్ రెడ్డి స్పందించిన తీరుపై ఆర్జీవి రియాక్ట్ ఎలా అయ్యారంటే?
పాపులర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను ఉద్దేశించి సందీప్ రెడ్డి వంగ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. భారతీయ సినిమా రంగానికి చేసిన సేవలు చూస్తే మీకంటే ఎవరు ఉండరని నేను అనుకొంటాను. నా యానిమల్ సినిమాపై నా ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్ ఇచ్చిన రివ్యూ చూసి ఉప్పొంగిపోయాను. కానీ మీ శైలిలో రాసిన అంశాలను నేను ఒప్పుకొను. కానీ ఎప్పడూ నా దృష్టిలో మీరు గొప్ప దర్శకుడని భావిస్తాను అని అన్నారు. సందీప్ రెడ్డి వంగకు తనదైన శైలిలో రాంగోపాల్ వర్మ స్పందించారు.

హలో సందీప్ రెడ్డి వంగ.. మీరు అనుకొన్నట్టు ఈ సిస్టమ్‌కు నేను పెద్దగా పొడిచిందేమీ లేదు. మీరు అనుకొన్నట్టు నేను పెద్దగా ఈ సిస్టమ్‌కు ఏమీ చేయలేదు. కానీ నీవు మాత్రం ప్రస్తుతం ఉన్న సంప్రదాయంగా సినిమాలు తీసే వ్యవస్థను ధ్వంసం చేశావు. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే.. నేను సహజసిద్దంగా, డిఫరెంట్‌గా సినిమాలు తీయవచ్చు. కానీ ఇంకా నేను సంప్రదాయ, కన్వెన్షనల్ పద్దతిలోనే సినిమాలు తీస్తున్నాను అని రాంగోపాల్ వర్మ అన్నారు.
అయితే యానిమల్ సినిమా తర్వాత నీవు ఈ ట్రెడిషనల్ సినిమా మేకింగ్‌ను విసిరి చెత్తకుండిలో వేశావు. భవిష్యత్‌లో ఎవరైతే భావోద్వేగాలను తెర మీద చూపిస్తారో వారే నిజమైన ఫిల్మ్ మేకర్ అవుతాడని నేను భావిస్తున్నాను. ఈ రోజుల్లో చాలా మంది ప్రేక్షకుల అభిరుచులను అంచనా వేయలేక కేవలం కమ్యూనికేటర్లుగానే మారుతున్నారు అని రాంగోపాల్ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
నీవు తీసిన సినిమాను చూస్తే.. నీవు డిజైన్ చేసిన క్యారెక్టర్లు గురించి గానీ.. అలాగే నీ సినిమాలు చూసే ప్రేక్షకులు ఏమనుకొంటారనే విషయాన్ని పట్టించుకోవనే విషయం స్పష్టమైంది. అందుకే నీవు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిజమైన ఎక్స్‌ప్రెషనిస్ట్ ఆర్టిస్ట్ అని నిజాయితీగా ఒప్పుకొంటున్నాను. అందుకు నీకు లక్షలాది సెల్యూట్స్ కొడుతున్నాను అని రాంగోపాల్ వర్మ చెప్పారు.
యానిమల్ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత 4వ రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 425 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వెర్షన్లకు పెద్దగా స్పందన కనిపించలేదు. నాలుగు భాషల్లో కేవలం 30 కోట్లకుపైగా సాధిస్తే.. హిందీ వెర్షన్ మాత్రం 247 కోట్లు రాబట్టింది. ఇక ఐదు రోజు మరో 40 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











