అప్పుడు అనసూయ.. ఇప్పుడు ఈమె.. యాంకర్‌పై వర్మ హాట్ కామెంట్!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనమే సృష్టించారు. తెలంగాణాలో మాత్రమే విడుదలై ఏపీలో విడుదల కాకున్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రచారంలో భాగంగా ఆర్జీవీ వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో ఓ వీడియోలో రాంగోపాల్ వర్మ తన ని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మీరే అందగత్తె

మీరే అందగత్తె

ఇంటర్వ్యూ మొత్తం పూర్తయ్యాక రాంగోపాల్ వర్మ తనని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ని ఉద్దేసించి ఇలా అన్నాడు. నేన్ను ఇంటర్వ్యూ చేసిన వారందరిలో మీరే చాలా అందంగా ఉన్నారు అని వ్యాఖ్యానించాడు. వర్మ కామెంట్ కు సదరు యాంకర్ సిగ్గుపడుతూ థాంక్యూ అని బదులిచ్చింది. తన మనసులో అనిపించిన విషయాన్ని బయటకు చెప్పేందుకు వర్మ ఏమాత్రం సంకోచించడు.

అనసూయ గురించి కూడా

అనసూయ గురించి కూడా

ప్రస్తుతం క్రేజీ నటిగా, యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ గతంలో ఓ మీడియా సంస్థలో టీవీ జర్నలిస్ట్ గా పనిచేసింది. ఆ సమయంలో అనసూయ ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే సీన్ జరిగింది. అనసూయ గ్లామర్ కు ఫిదా అయిన వర్మ ఆమెపై లైవ్ లోనే పొగడ్తలు కురిపించాడు. నేను చూసిన యాంకర్లందరూ మీరే అందగత్తె అంటూ అనసూయని పొగడ్తలతో ముంచెత్తాడు.

వర్మతో కలసి

వర్మతో కలసి

మీడియా నుంచి అనసూయ బయటకు వచ్చిన తర్వాత రాంగోపాల్ వర్మ వద్ద చాలా కాలం పనిచేసింది. ఆ సమయంలో అనసూయ గురించి అనేక రూమర్లు వినిపించాయి. ఆ రూమర్లన్నింటికీ అనసూయ అప్పట్లోనే ఘాటుగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ టాలీవుడ్ లో క్రేజీ నటి. రంగస్థలం చిత్రంలో అనసూయ తన నటనతో అందరిని ఫిదా చేసింది.

కోర్టులో లక్ష్మీస్ ఎన్టీఆర్

కోర్టులో లక్ష్మీస్ ఎన్టీఆర్

ఇదిలా ఉండగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు సంబంధించిన పిటిషన్ కోర్టులో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల కాకుండా కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టులో ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. ఈ కేసు వ్యవహారం తేలితే కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఏపీలో విడుదలపై క్లారిటీ రాదు. ఇటీవల రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఈ వారం ఏపీలో విడుదలవుతుందని ప్రకటించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్నికలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని టీడీపీ నేతలు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X