Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రేవంత్‌రెడ్డి బాహుబలి.. మహేశ్‌బాబు కుళ్లుతో చచ్చిపోతాడు.. వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌ను వదిలేశాడనుకుంటే మళ్లీ ఫేస్బుక్లో పదునైన వ్యాఖ్యలతో దడదడలాడిస్తున్నాడు. సినిమాను పాలిటిక్స్‌తో మిక్స్ చేసి పోస్టులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు ఆర్జీ
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌ను వదిలేశాడనుకుంటే మళ్లీ ఫేస్బుక్లో పదునైన వ్యాఖ్యలతో దడదడలాడిస్తున్నాడు. సినిమాను పాలిటిక్స్‌తో మిక్స్ చేసి పోస్టులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు ఆర్జీవి. గత కొద్దికాలంగా ఎన్టీఆర్ బయోపిక్‌పై స్పందించిన వర్మ తాజాగా ఏపీ పాలిటిక్స్‌పై తన అస్త్రాన్ని గురిపెట్టారు. ఇంతకు ఆయన ఏమన్నారంటే...
రేవంత్‌రెడ్డి బాహుబలి..
తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళి నమ్మకం వచ్చింది అని వర్మ అన్నారు.
కాంగ్రెస్‌కు నోట్ల వర్షమే..
ఇంక అంతే కాకుండా రేవంత్‌రెడ్డి అంశాన్ని సినిమాతో ముడిపెట్టి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి సినిమా అని అన్నారు. బాహుబలి బాక్సాఫీస్‌కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కి ఓట్ల వర్షం కురిపిస్తాడు అని ఆర్జీవి అన్నాడు.
కేసీఆర్ కంటే 100 రెట్లు
ఇక లక్ష్మీస్ వీరగ్రంథం అనే సినిమాను తీసున్నానని ప్రకటించిన దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డిని వదలలేదు. ‘కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గారికి తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారి కన్న 100 రెట్లు ఎక్కువ ఎక్సట్రార్డినరీ స్క్రీన్ ప్రెజన్స్ వుంది. కేతిరెడ్డిని చూసాడంటే మహేష్‌బాబు కూడా కుళ్ళు తో చచ్చిపోతాడు అని వర్మ అన్నారు.
ఎన్టీఆర్ లారీ లోడ్ పూలతో
లక్ష్మి'స్ వీరగ్రంథంలో వీరగంధం పాత్ర తను వేస్తే ఆ చిత్రం బ్లాక్‌బస్టర్ గ్యారంటీ. కేతినేని హీరోగా వీరగంధం పాత్ర మరియు హీరోయిన్గా ఒక సెక్సీ వీపు .. వావ్!! సూపరో సూపరు. నందమూరి తారకరామారావు గారు స్వర్గం నుంచి ఒక లారీ లోడ్ అక్షింతలు కేతిరెడ్డి నెత్తి మీద చల్లడం ఖాయం అని వర్మ ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు.