twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘26/11’ ఘటనపై వర్మ సినిమా...

    By Bojja Kumar
    |

    వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసంచలన సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. 2008 నవంబర్ 26న ముంబై మహా నగరంపై జరిగిన ముష్కర దాడిని సినిమా రూపంలోకి తేవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ సినిమా పేరు '26/11' నిర్ణయించినట్లు తెలుస్తోంది.

    ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ...''26/11 సంఘటన ఏ భారతీయుడు మరిచిపోని రోజు...అప్పుడు ఉగ్రవాదులు జరిపిన దాడిని లైవ్ టెలికాస్ట్ చూసిన వారి కళ్లలో ఆ సంఘటన ఇప్పటికీ మెదలుతూనే ఉంది. అప్పుడు జరిగిన నరమేధం ఎన్నటికీ మరిచిపోనిది. నా కెరియర్ లోనే ఒక చాలెంజ్ గా తీసుకుని ఈ సినిమా తెరకెక్కించబోతున్నాను'' అని చెప్పారు. కసబ్ మరియు అతని టీం సభ్యులు ముంబైకి ఎలా వచ్చారు అమర్ సింగ్ సోలంకి మరియు ఇతర పోలీసు సిబ్బంది పరిస్థితిని ఎలా కంట్రోల్ చేసారు వంటి అంశాలు చూపించబోతున్నట్లు చెప్పారు. నూతన నటీ నటులతో త్వరలోనే ఈ సినిమా ప్రారంభించాబోతున్నట్లు హిందీ మరియు ఆంగ్ల భాషల్లో తీయబోతున్నట్లు చెప్పారు.

    ముష్కర దాడులు జరిగిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, అతని కొడుకు రితేష్ దేష్ ముఖ్ తో కలిసి దాడికి గురైన తాజ్ హోటల్‌ను వర్మ సందర్శించారు. అప్పట్లోనే వర్మ ఈ ఘటనపై సినిమా తీస్తున్నట్లు, అందులో రితేష్ దేశ్ ముఖ్ హీరోగా నటింపచేయాలనే ఉద్దేశ్యంతోనే అతన్ని వెంట తీసుకుని సంఘటన స్థలానికి వెళ్లాడని మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ఆ వార్తలను ఖండించిన వర్మ...తాజాగా ఆ ఘటనపై సినిమా తీయాలని నిర్ణయించుకోవడం గమనార్హం.

    English summary
    Ram Gopal Varma has finally announced that he will be making a film on the 26/11 terror attacks in Mumbai. The film is tentatively titled '26/11'. Says the maverick filmmaker, "26/11 is a date no Indian will ever forget. The three-day live telecast of the terrorist carnage had people's eyes glued to the television sets across world".
 
 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X