చిలిపి చేష్టల అమ్మాయితో రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీం’
హైదరాబాద్: ఆ మధ్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'హార్ట్ ఎటాక్' మూవీలో తన చిలిపి చేష్టలతో ఓ అమ్మాయి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో హీరోయిన్లకు ఫ్రెండుగా నటించిన ఆ అమ్మాయి పేరు తేజస్విని. ఇటీవల వచ్చిన 'మనం' చిత్రంలో కూడా తేజస్విని సమంత ఫ్రెండు పాత్రలో నటించింది.
తాజాగా ఈ అమ్మాయి హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. దర్శకుడు రాంగోపాల్ వర్మ తేజస్విని హీరోయిన్‌గా ఈ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా పేరు 'ఐస్ క్రీమ్'!. నవదీప్ ఇందులో హీరోగా నటిస్తుండగా... తేజస్వి కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రాన్ని కేవలం మూడు నెలల్లో పూర్తి చేస్తానని వర్మ చెబుతున్నాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

ఈ మధ్య కాలంలో వరుస ప్లాపులు చవి చూస్తున్న రామ్ గోపాల్ వర్మ...ఇటీవల మంచు ఫ్యామిలీతో 'రౌడీ' సినిమా తెరకెక్కించి మరోసారి పరాజయం చవి చూసాడు. ఆయన వరుస ప్లాపుల నేపథ్ంలో రాజశేఖర్‌తో చేసిన హారర్ సినిమా 'పట్ట పగలు' కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
మరో వైపు మంచు విష్ణు హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరరెక్కిస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత వర్మ తెరకెక్కించే 'ఐస్ క్రీం' చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











