రక్తచరిత్రపై మళ్లీ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ
రక్త చరిత్ర సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. రక్త చరిత్ర సినిమా ప్రివ్యూ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రక్త చరిత్ర సినిమా చూసిన తర్వాత ఎవరైనా మాట్లాడాలని, సినిమా చూడకుండా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. తన సినిమాలకు ప్రత్యేకంగా ఆడియన్స్ లేరని ఆయన అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారనేదానికి అర్థం లేదని అన్నారు. తాను ప్రేక్షకుల కోసం సినిమా తీయనని, తన కోసమే సినిమాలు తీసుకుంటానని ఆయన అన్నారు. తనకు క్రీడలంటే పరమ అసహ్యమని చెప్పుకున్నారు.


Click it and Unblock the Notifications











