twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విరాళాలు ఇచ్చిన హీరోల పై వర్మ వెటకారం

    By Srikanya
    |

    హైదరాబాద్: తుపాను బాధితులను ఆదుకోవడానికి చిత్ర పరిశ్రమలోని హీరోలంతా ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇలా విరాళాలు ఇస్తున్న హీరోలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్స్ వేసారు. ఆయన ట్వీట్ చేస్తూ... " వందల కోట్లు జనాల నుంచి తీసుకున్న స్టార్స్ కేవలం కొద్ది లక్షలు మాత్రమే వైజాగ్ కోసం ఇవ్వటం నన్ను షాక్ కు గురి చేసింది. వాళ్లు చాలా ప్రేమ, ప్రార్ధనను ఇస్తున్నారు. ఎందుకంటే అది ఉచితం కాబట్టి ", అంటూ వెటకారం చేసారాయన.

    ఇక ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌.. వీళ్లంతా తమ చేతనైన సహాయం చేయడానికి ముందుకొచ్చారు. పరిశ్రమలోని వివిధ విభాగాలు కర్తవ్యదీక్షకు పూనుకొన్నాయి. ఓ కొత్త సినిమా వస్తే కటౌట్లు కట్టి, వసూళ్లతో పండగ చేయించే ప్రజానీకాన్ని ఆదుకోవడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నాయి. 'మేమున్నామని, మీకేం కాదని' భరోసా ఇస్తున్నాయి. రాష్ట్రంలో ఎలాంటి విపత్తు సంభవించినా తనవంతు చేయూతనివ్వడానికి పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడూ ముందే ఉంటారు. వెంటనే రూ.50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారాయన.

    Ram Gopal Varma Makes Fun Of Hudhud Donors

    మహేష్‌బాబు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల సహాయం ప్రకటించారు. జరిగిన నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరని చేయూతనిచ్చి ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని మహేష్‌ సూచించారు. ప్రముఖ కథానాయకుడు కృష్ణ రూ.15 లక్షలు, విజయనిర్మల రూ.10లక్షలు విరాళం ప్రకటించారు. ఎన్టీఆర్‌ రూ.20 లక్షల విరాళాన్ని ప్రకటించారు.

    ''మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకురావాల్సిన తరుణమిది. అభిమానులు విస్తృతంగా సేవా కార్యక్రమాలను చేపట్టాలి'' అని సందేశం పంపారాయన. కథానాయకుడు ప్రభాస్‌ రూ.20 లక్షలు, మరో కథానాయకుడు అల్లు అర్జున్‌ రూ.20 లక్షలు సహాయం ప్రకటించారు. హుద్‌హుద్‌ బాధితులను ఆదుకోవడానికి రామ్‌చరణ్‌ కూడా ముందుకొచ్చారు. తన వంతుగా రూ.10 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో రూ.5 లక్షలు రామకృష్ణ మిషన్‌కి విరాళం ప్రకటించారు.

    రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ''జరిగిన నష్టాన్ని చూస్తుంటే నోట మాట రావడం లేదు. విశాఖపట్నం అందమైన నగరం. ఇప్పుడు ప్రకృతి విలయం కబళించింది. నా వంతుగా పులిహోర పొట్లాలూ, నీళ్లూ, పాలూ అందించే ఏర్పాటు చేశా. అపోలో ద్వారా వైద్యసహాయం అందించే ఏర్పాట్లూ జరుగుతున్నాయి. రవాణా సాధ్యం కావడం లేదు. దగ్గర్లో ఉన్న అభిమానులంతా ఒక్కటై తమ వంతు సేవ చేయడానికి ముందుకు రండి. నాతోటి నటీనటులతోనూ మాట్లాడి, చేతనైనంత సాయం చేయమని అడుగుతా. సాధ్యమైనంత త్వరగా ప్రజలందరూ కోలుకోవాలి''అన్నారు.

    కోనవెంకట్‌ (రూ.లక్ష), సంపూర్ణేష్‌బాబు (రూ.లక్ష) సహాయం ప్రకటించారు. నిర్మాతల మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తమ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్టు ప్రకటించింది.

    English summary
    "I'm shocked that stars who have hundreds of crores from people are just giving away few lakhs to Vizag. They are giving lots of love and prayer because they are free", quips Ram Gopal Varma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X